కార్గిల్ జరిగినప్పుడే ఆడలేదా.. పుల్వామా జరిగినా ఆట ఆటే... (video)
పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిది.. ఆ దేశ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు వంత పాడాడు. భారత్ పాకిస్థాన్‌పై ప్రతీకార దాడికి దిగుతుందని భావించట్లేదు. ఒకవేళ దిగితే కనుక తగిన విధంగా బుద్ధి చెప్తాం. భారత్ దాడి చేస్తే చేతులు ముడుచుకుని కూర్చుని వుండమని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై అఫ్రిది స్పందించాడు. ఇమ్రాన్‌కు అండగా నిలిచాడు.
ఈ విషయంలో ఎటువంటి సందేహం అక్కర్లేదని అఫ్రిది ట్వీట్ చేశాడు. పాకిస్థాన్‌తో చర్చలు అనవసరమని, యుద్ధమే పరిష్కారమని పుల్వామా ఘటన తర్వాత టీమిండియా మాజీ క్రికెటర్ గంభీర్ చేసిన ట్వీట్‌కు కూడా అఫ్రిది స్పందించాడు. అతడికి ఏమైంది అంటూ గంభీర్ ట్వీట్‌పై ముక్తసరిగా సమాధానం ఇచ్చాడు. ఇంకా ఇమ్రాన్ ఖాన్‌కు మద్దతుగా నిలిచాడు.
ఇలా.. భారత, పాకిస్థాన్ క్రికెటర్లు పుల్వామా ఘటనపై మాటలతో దాడి చేసుకుంటున్న తరుణంలో పుల్వామా దాడికి అనంతరం ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లవా పాకిస్థాన్‌తో భారత్ ఆడే మ్యాచ్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబై దాడుల తర్వాత పాకిస్థాన్‌తో క్రికెట్ గురించి చర్చ వచ్చిన ప్రతిసారి తాను ఒకటే చెప్తుంటానని.. రాజకీయాలు వేరు, క్రీడలు వేర్వేరని శుక్లా అన్నారు.
తాజా ఉగ్రదాడితో ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. ఇమ్రాన్ ఖాన్ చిత్రపటంపై పరదా, మొహాలిలో పాక్ క్రికెటర్ల ఫొటోలు తొలగించడం సరైన నిర్ణయమే. ఉగ్రవాదాన్ని పూర్తిగా వదిలేసే వరకూ పాక్‌తో క్రికెట్ గురించి చర్చలు జరపబోం. ఇక ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ గురించి కేంద్రం నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని రాజీవ్ శుక్లా వెల్లడించాడు.
ఇకపోతే.. దశాబ్దకాలంగా పాకిస్థాన్‌తో ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడనప్పటికీ ఆసియా కప్, ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి ఐసీసీ టోర్నీల్లో మాత్రం భారత్ తలపడుతోంది. కానీ.. తాజాగా ఉగ్రదాడితో ఆ బంధానికి కూడా తెరపడే అవకాశముందని టాక్ వస్తోంది. ఇక మే 30 నుండి ఇంగ్లాండ్ వేదికగా వన్డే ప్రపంచకప్ మొదలుకానున్న సంగతి తెలిసిందే.
షెడ్యూల్ ప్రకారం జూన్ 16న భారత్, పాకిస్థాన్ జట్లు తలపడాల్సి ఉంది. కానీ.. ఈ మ్యాచ్‌ను బహిష్కరించి వరల్డ్‌కప్ వేదికగా పాక్ దుశ్చర్యని ప్రపంచానికి తెలియజేయాలని టీమిండియాకి అభిమానులు సూచిస్తున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవ్ రిచర్డ్సన్ ఇండో-పాక్ ప్రపంచ కప్ మ్యాచ్‌పై స్పందించారు. "ప్రస్తుతానికి ఐసీసీ వరల్డ్ కప్ షెడ్యూల్‌లో ఎటువంటి మార్పు లేదని యధాప్రకారమే జరుగుతందని" స్పష్టం చేశారు. పుల్వామా ఘటనలో మరణించిన జవాన్లకు తన సానుభూతి వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ విషయం పై ఐసీసీ సభ్య దేశాలతో సమీక్షిస్తున్నామని తెలిపారు
అయితే లీగ్ దశలో పాకిస్థాన్‌తో భారత్ ఆడాల్సిన అవసరం లేదన్న హర్భజన్ వ్యాఖ్యలకు బీసీసీఐ సీనియర్ అధికారి స్పందిస్తూ.. అది భజ్జీ వ్యక్తిగత విషయమని.. పాకిస్థాన్‌తో లీగ్ దశలో భారత్ ఆడకూడదనుకుంటే, సెమీఫైనల్ లేదా ఫైనల్ మ్యాచ్‌లలో ఆడాల్సి వస్తే తప్పుకుంటామా?1996 కార్గిల్ యుద్ధం తీవ్రంగా జరుగుతున్న సమయంలో కూడా పాకిస్థాన్‌తో భారత్ ఆడిందన్న విషయాన్ని గుర్తుకు తెచ్చాడు.