సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (10:39 IST)

భారత సైన్యమా కాస్కో.. మరిన్ని దాడులు జరుగుతాయ్: జైషే

భారత్‌లో మరిన్ని దాడులు జరుగుతాయని.. ఏ క్షణమైనా ఆ దాడులు జరుగవచ్చునని ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ భారత్‌ని రెచ్చగొట్టేందుకు మరో వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో ఒక టెర్రరిస్ట్ మాట్లాడుతూ.... భారత్‌లో మరిన్ని దాడులు జరుగుతాయని.. ధైర్యం ఉంటే ఎదుర్కోమని భారత సైన్యానికి సవాలు విసిరాడు. దీంతో పుల్వామా ఆత్మాహుతి దాడి పాక్ పనేనని ముందు నుండి ఆరోపిస్తున్న భారత్‌కు ప్రస్తుతం మరో ఆధారం లభించింది. 
 
కాగా పుల్వామాలో భారత సీఆర్పీఎఫ్‌ బలగాల కాన్వాయ్‌పై జరిగిన దాడిలో తమ ప్రమేయం లేదని బుకాయిస్తున్న పాకిస్తాన్‌కు తాజాగా విడుదల చేసిన వీడియో ద్వారా ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ షాక్ ఇచ్చింది. పుల్వామా ఉగ్రదాడిలో పాకిస్తాన్ ప్రమేయం లేదని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఖండించిన విషయం తెలిసిందే.

పుల్వామా దాడిలో పాకిస్తాన్ పాత్ర ఉంటే.. ఆధారాలు చూపాలంటూ భారత్‌ను ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో జైష్ మరో వీడియోను విడుదల చేసి పాకిస్థాన్‌కు గట్టి షాక్ ఇచ్చింది.