యూనిట్ సభ్యులకు నయనతార ఆ గిఫ్ట్... ఎంత ఆనందమో...?

Nayanatara
వాసుదేవన్ ఆరంబాకం| Last Modified సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (19:22 IST)
మహానటి సినిమాలో మహానటిగా నటించడం కంటే జీవించేసిన కీర్తి సురేష్ అప్పట్లో పందెం కోడి 2 షూటింగ్ పూర్తిచేసిన తర్వాత చిత్ర యూనిట్‌లోని అందరికీ బంగారు నాణేలు అందజేసిన విషయం తెలిసిందే. అయితే... ఇప్పుడు అదే వరుసలో నయనతార వచ్చి చేరారంటున్నారు సినిమా యూనిట్ సభ్యులు.

అసలు విషయానికి వస్తే... పాత్రకి ప్రాధాన్యత ఉంటే ఎటువంటి రోల్‌లో‌నైనా నటించేందుకు వెనుకాడని ఈ లేడీ సూపర్ స్టార్ తమిళనాట ఇప్పటికే వరుస విజయాలతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే... కాగా తాజాగా ‘ఓకే ఓకే ‘ఫేమ్ ఎమ్ రాజేష్ తెరకెక్కిస్తున్న మిస్ట‌ర్ లోక‌ల్ చిత్రంలో శివకార్తికేయన్ సరసన క‌థానాయిక‌గా న‌టిస్తున్న న‌య‌న‌తార ఇటీవ‌ల త‌న పాత్రకి సంబంధించిన షూటింగ్‌ని పూర్తి చేసుకుంది.

అయితే షూటింగ్ పూర్తయిన వెంట‌నే నయన్, చిత్ర యూనిట్‌కి సంబంధించిన వారంద‌రికీ ఫాసిల్ కంపెనీ వాచ్‌ల‌ని గిఫ్ట్‌గా అందజేసింది. దీనిపై చిత్ర బృందం సంతోషం వ్య‌క్తం చేసింది. హిప్ హాప్ సంగీతం అందించిన ఈ చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.దీనిపై మరింత చదవండి :