గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: గురువారం, 24 జనవరి 2019 (14:50 IST)

అలా చేయడానికి నయనతారను ఒప్పించిన చెర్రీ..!

తెలుగు సినీపరిశ్రమలో తండ్రి కోసం కొడుకు, కొడుకు కోసం తండ్రి పడుతున్న ఉత్సాహం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వారెవరో ఇప్పటికే అర్థమై ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి.. రాంచరణ్. రాంచరణ్‌ను సినీపరిశ్రమలో తిరుగులేని నటుడిగా నిలబెట్టాలని చిరంజీవి ప్రయత్నిస్తుంటే సినీ పరిశ్రమలోకి తిరిగొచ్చిన చిరంజీవిని మళ్ళీ అగ్ర నటుడిగానే కొనసాగించాలని చెర్రీ ప్రయత్నిస్తున్నాడు.
 
చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెంబర్ 150లో నటించిన తరువాత కాస్త గ్యాస్ ఇచ్చి సైరా సినిమాలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ మూవీ సైరా. ఈ సినిమాలో నయనతార కీలక పాత్రను పోషిస్తోంది. అయితే సినిమా ప్రమోషన్‌లో పాల్గొనడం నయనతారకు ఇష్టం లేదనే సమాచారం వస్తోంది. 
 
అనామిక సినిమా నుంచి నయనతార ఇలాగే చేస్తోంది. అయితే సైరా సినిమాకు మాత్రం అలా చేయవద్దని, ప్రమోషన్లో పాల్గొనమని కోరుతున్నాడు చెర్రీ. నయనతారకు స్వయంగా ఫోన్ చేసి ఆమెను ఒప్పించాడట. చెర్రీ మాట్లాడటంతో తన నిర్ణయాన్ని మార్చుకుని చెర్రీకి ఒకే చెప్పింది. సినిమా ప్రమోషన్‌కు ఎక్కడికి రమ్మంటే అక్కడకు వస్తానంటోంది నయనతార.