శనివారం, 30 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 27 జనవరి 2018 (15:46 IST)

అంగట్లో ఆటగాళ్లు.. ఆ క్రికెటర్ ధర రూ.12.50 కోట్లు...

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 11వ సీజన్ కోసం క్రికెటర్ల అమ్మకం కోసం వేలం పాటలు శనివారం నిర్వహించారు. బెంగుళూరు వేదికగా ఈ వేలం పాటలు సాగుతున్నాయి. ఇందులో ఐపీఎల్‌లోని అన్ని ఫ్రాంచైజీలు పాలుపంచుకున్నాయి.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 11వ సీజన్ కోసం క్రికెటర్ల అమ్మకం కోసం వేలం పాటలు శనివారం నిర్వహించారు. బెంగుళూరు వేదికగా ఈ వేలం పాటలు సాగుతున్నాయి. ఇందులో ఐపీఎల్‌లోని అన్ని ఫ్రాంచైజీలు పాలుపంచుకున్నాయి. ఇప్పటివరకు జరిగిన వేలం పాటలో ఇంగ్లండ్ బెన్ స్టోక్ అత్యధికంగా రూ.12.50 కోట్లకు అమ్ముడుపోయాడు. ఇతగాడిని రాజస్థాన్ రాయల్ జట్టు కైవసం చేసుకుంది. అలాగే, మనీష్ పాండేను రూ.11 కోట్లకు హైదరాబాద్ సన్ రైజర్స్ కొనుగోలు చేసింది.
 
ఇకపోతే, కే.ఎల్.రాహుల్ ధర రూ.11 కోట్లు పలుకగా, కరుణ్ నాయర్ ధర రూ.5.6 కోట్లకు, డేవిడ్ మిల్లర్‌ను రూ.3 కోట్లకు, యువరాజ్ రూ.2.40 కోట్లకు కింగ్స్ పంజాబ్ జట్టు తీసుకుంది.
 
అలాగే, క్రిస్ లైన్‌ను రూ.9.6 కోట్లకు కోత్‌కతా నైట్ రైడర్స్ తీసుకుంది. ఆస్ట్రేలియా ప్లేయర్ మ్యాక్స్ వెల్‌ను రూ.9 కోట్లకు, గంభీర్‌ను రూ.2.80 కోట్లకు ఢిల్లీ డేర్ డెవిల్స్ కొనుగోలు చేసింది.
 
భారత స్పిన్నర్ అశ్విన్‌ను రూ.7.60 కోట్లకు పంజాబ్ టీం సొంతం చేసుకుంది. వెస్టిండీస్ ఆల్‌రౌండర్ బ్రావో రూ.6.40 కోట్లకు, హర్భజన్‌ను రూ.2 కోట్లకు, డూప్లిసెస్‌ను రూ.1.60 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కైవసం చేసుకుంది. 
 
వీరితో పాటు శిఖర్ ధావన్‌ను రూ.5.20 కోట్లకు హైదరాబాద్ సన్ రైజర్స్ దక్కించుకోగా, పోలార్డ్‌ను రూ.5.40 కోట్లకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. బ్రెండెన్ మెక్లాం రూ.3.5కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తీసుకుంది. రహానేను రూ.4 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ తీసుకుంది.