గురువారం, 28 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 14 జులై 2017 (15:47 IST)

ఐపీఎల్‌లో ఇక చెన్నై సూపర్ కింగ్స్... రెండేళ్ళ నిషేధం హుష్ కాకి.. ధోనీ సారథ్యంలో?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో చిక్కుకున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై విధించిన రెండేళ్ల నిషేధానికి గురువారంతో తెరపడింది. దీంతో వచ్చే ఏడాది నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో చిక్కుకున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై విధించిన రెండేళ్ల నిషేధానికి గురువారంతో తెరపడింది. దీంతో వచ్చే ఏడాది నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్ బరిలోకి దిగనుంది.

గత ఏడాది 2015వ సంవత్సరం చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ యాజమాన్యం సభ్యుడు గురునాథ్ మెయ్యప్పన్, రాజస్థాన్ జట్టు కో-ఓనర్, శిల్పాశెట్టి భర్త రాజీవ్ కుంద్రా ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తేలింది. దీంతో ఆయా జట్లపై రెండేళ్ల  పాటు నిషేధం విధించడం జరిగింది. చెన్నై, రాజస్థాన్ జట్లు లేకుండా రెండేళ్ల పాటు ఐపీఎల్ సీజన్లు చప్పగా సాగిపోయాయి.
 
అయితే వచ్చే ఏడాది ధోనీ సారథ్యం వహించిన చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్‌లో బరిలోకి దిగనుందనే వార్త తెలియరాగానే.. క్రికెట్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తన ట్విట్టర్ ద్వారా తెలిపింది. కాగా ధోనీ సారథ్యం వహించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అన్నీ సీజన్లలో ప్లే ఆఫ్ వరకు రాణించింది. ఇంకా రెండుసార్లు ఐపీఎల్‌ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.