సోమవారం, 30 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 25 అక్టోబరు 2017 (15:58 IST)

ఎవరైనా కెప్టెన్ కావచ్చనే నమ్మకాన్ని కలిగించాడు ఆ క్రికెటర్ : సునీల్

భారత క్రికెట్ జట్టు లెజెండ్ కపిల్ దేవ్‌పై మరో దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించారు. భారత క్రికెట్ జట్టుకు ఎవరైనా కెప్టెన్ కావచ్చనే నమ్మకాన్ని కలిగించాడని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.

ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ రాసిన 'డెమోక్రసీస్ లెవెన్ - ది గ్రేట్ ఇండియన్ క్రికెట్ స్టోరీ' పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇందులో సునీల్ గవాస్కర్ పాల్గొని మాట్లాడుతూ... భారత క్రికెట్‌లో గేమ్ ఛేంజర్ కపిల్ దేవ్ అని కొనియాడారు. 
 
ఒక నాన్ మెట్రో ప్రాంతం నుంచి వచ్చి క్రికెట్ అభిమానుల గుండెల్లో నిలిచిపోయాడని, ఎవరైనా సరే భారత్ తరపున క్రికెట్ ఆడొచ్చు, కెప్టెన్ కూడా కావచ్చు అనే నమ్మకాన్ని కలిగించింది కపిలే అని చెప్పుకొచ్చాడు. సిటీ నేపథ్యం లేని ఓ వ్యక్తిని చూడ్డానికి జనాలు పోటెత్తారంటే అది కేవలం కపిల్ వల్లే సాధ్యమైందని చెప్పారు.