మంగళవారం, 26 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 2 డిశెంబరు 2016 (14:39 IST)

ఆసియా కప్ టీ-20: నేపాల్ 21 పరుగులే.. 99 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం

ఆసియా కప్ మహిళల ట్వంటీ-20 టోర్నీలో భారత మహిళా జట్టు గెలుపును నమోదు చేసుకుంది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన భారత్‌... ఐదింట్లోను గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. కాగా నేపాల

ఆసియా కప్ మహిళల ట్వంటీ-20 టోర్నీలో భారత మహిళా జట్టు గెలుపును నమోదు చేసుకుంది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన భారత్‌... ఐదింట్లోను గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. కాగా నేపాల్‌తో తలపడిన భారత మహిళా క్రికెట్ జట్టు 99 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 120 పరుగులు సాధించింది. 
 
భారత మహిళా జట్టులో శిఖా పాండే అద్భుత ఇన్నింగ్స్ ద్వారా 39 పరుగులు సాధించింది. ఫలితంగా 121 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్, భారత వుమెన్స్ బౌలర్ల ధాటికి తట్టుకోలేకపోయింది. దీంతో నేపాలీ వుమెన్స్ ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్‌కు క్యూ కట్టారు. 16.3ఓవర్లలో నేపాల్‌ కేవలం 21పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్ల ధాటికి నేపాల్‌ క్రీడాకారులందరూ సింగిల్‌ డిజిట్‌కే ఔటయ్యారు.
 
ఈ మ్యాచ్‌లో సరిత మగర్‌ అనే క్రీడాకారిణి చేసిన ఆరు పరుగులే వ్యక్తిగతంగా నేపాల్‌ క్రీడాకారిణుల్లో అత్యధిక స్కోరు కావడం గమనార్హం. నలుగురు క్రీడాకారిణులు ఖాతా తెరవకుండానే ఔటయ్యారు. భారత్‌ తరఫున పూనమ్‌ యాదవ్‌ మూడు వికెట్లు పడగొట్టగా, మేఘన, పాటిల్‌ చెరో రెండు వికెట్లు, పాండే, జోషి, బిస్తా తలో వికెట్‌ తీసుకున్నారు.