బుధవారం, 22 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 2 మే 2023 (13:24 IST)

ఐపీఎల్ 2023 : విరాట్ కోహ్లీ పాదాలకు మొక్కిన వీరాభిమాని

virat kohli
ఐపీఎల్ 2023 మ్యాచ్‌లలో భాగంగా, లక్నో సూపర్ జెయింట్స్ - రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగుళూరు (ఆర్సీబీ) మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. లక్నో ఇన్నింగ్స్‌ జరుగుతుండగా ఆర్బీబీ మాజీ సారథి విరాట్ కోహ్లీ విరాభిమాని ఒకరు.. భద్రతను ఉల్లంఘించి మైదానంలో పరుగులు తీశాడు. నేరుగా కోహ్లీ వద్దకు పరుగెత్తుకుంటూ వెళ్లిన అభిమాని, విరాట్ కోహ్లీ కాళ్లకు దండకు పెట్టాడు. 
 
వెంటనే కోహ్లీ అతడిని పైకి లేవతీసి హగ్ చేసుకుని బయటకు వెళ్లాలని సూచించాడు. ఇక కోహ్లీని కలిసిన ఆ వీరాభిమాని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక సదరు అభిమాని పట్ల కోహ్లీ ప్రవర్తించిన తీరుపై ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 
 
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, గతంలో కూడా ఇటువంటి సంఘటనలు చాలా జరిగాయి. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే లక్నోపై 18 పరుగులు తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది.