మంగళవారం, 26 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By మోహన్
Last Updated : గురువారం, 4 ఏప్రియల్ 2019 (18:19 IST)

మహిళా క్రికెటర్‌లతో కలిసి మిక్స్‌డ్‌ టీ20లో కోహ్లి ఆడనున్నాడా!

మీరు ఇప్పటివరకు టెన్నిస్‌, బ్యాడ్మింటన్‌లో మాత్రమే పురుషులు మరియు మహిళలు కలిసి ఆడటం చూసి ఉంటారు. అయితే ఇప్పుడు క్రికెట్‌లో సైతం మిక్స్‌డ్ ఈవెంట్‌కు రంగం సిద్ధమవుతోంది. దీనిని టీ20 ఫార్మాట్‌లో నిర్వహించడానికి ఐపీఎల్‌ ఫ్రాంచైజీ రాయల్‌ ఛాలెంజర్స్‌ యాజమాన్యం(ఆర్‌సీబీ) కసరత్తులు చేస్తోంది.


క్రికెట్‌లో ‘మిక్స్‌డ్‌’ ప్రయోగానికి రంగం సిద్ధం చేస్తున్నారు. లింగ భేధాలు లేవు, అందరూ సమానమే అనే సందేశాన్ని ప్రపంచానికి తెలియజేయడమే ఈ మ్యాచ్ యొక్క ముఖ్య ఉద్దేశం.
 
పురుష మరియు మహిళా క్రికెటర్లను కలిపి జట్లుగా విభజించి టీ-20 ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌‌ను నిర్వహించేందుకు ఆర్సీబీ సన్నాహాలు చేస్తోంది. కొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే ప్రపంచ కప్ తర్వాత ఈ మ్యాచ్‌ను నిర్వహించే అవకాశం ఉంది. ఇందుకోసం భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, భారత మహిళల వన్డే జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌, టీ20 సారథి హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌, బ్యాట్స్‌వుమన్‌ వేదా కృష్ణమూర్తి పేర్లను ఖరారు చేసినట్టు తెలుస్తోంది.