Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెట్‌లో ఫోర్లు - సిక్స్‌లే కాదు.. ఎయిట్స్ కూడా ఉండాలని.. ధోనీ నయా ఐడియా

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి సరికొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చాడు. మ్యాచ్‌లో బౌండరీ లైన్‌ను బంతి దాటితే ఇస్తున్న ఫోర్, సిక్స్‌లకు అదనంగా ఎయిట్ (8)ను కూడా చేర్చాలని అన్నాడు. బ

Written By pnr
Updated: బుధవారం, 11 ఏప్రియల్ 2018 (13:54 IST)
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి సరికొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చాడు. మ్యాచ్‌లో బౌండరీ లైన్‌ను బంతి దాటితే ఇస్తున్న ఫోర్, సిక్స్‌లకు అదనంగా ఎయిట్ (8)ను కూడా చేర్చాలని అన్నాడు. బంతి స్టేడియం బయట పడితే ఎనిమిది పరుగులు ఇస్తే బాగుంటుందనే సరికొత్త అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. 
 
ప్రస్తుతం జరుతున్న ఐపీఎల్ పదకొండో సీజన్ పోటీల్లో భాగంగా, మంగళవారం చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తలపడి విజయం సాధించింది. దాదాపు రెండేళ్ల తర్వాత పసులు జెర్సీ వేసుకుని సీఎస్కే జట్టుకు ధోనీ నాయకత్వం వహించాడు. 
 
ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టు నిర్ధేశించిన 202 పరుగుల లక్ష్యాన్ని సీఎస్కే జట్టు సులభంగా చేధించింది. ఈ మ్యాచ్‌లో మొత్తం 31 సిక్స్‌లు నమోదు కాగా, కొన్ని బంతులు స్టేడియం బయటకు వెళ్లిపోయాయి కూడా. ఇక ప్రజెంటేషన్ సమయంలో మాట్లాడిన ధోనీ బంతి బయట పడితే ఆరు పరుగులకు బదులుగా ఎనిమిది పరుగులు ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇది ఇపుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 
About Author
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... Read More

అన్నీ చూడండి

గుండెపోటుతో కుప్పకూలిన సచివాలయ ఉద్యోగి, సీపీఆర్ చేసిన మంత్రి శ్రీహరి, కానీ....(వీడియో)

పెళ్లి చేసుకోవాల్సిన అన్నయ్య చనిపోయాడు, తమ్ముడు తాళి కట్టాడు, వీడియో

Ram Mohan Naidu: డీఎస్సీ ఉపాధ్యాయుల నియామకాలు.. వైకాపా ఆరోపణలు అవాస్తవం

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

నన్ను టార్గెట్ చేస్తే మీ బండారం బయటపెతా : విజయసాయి రెడ్డి వార్నింగ్

అన్నీ చూడండి

Sangeeth Shobhan: అంతా రాములోరు చూస్కుంటారు. అంటున్న సంగీత్ శోభన్

ఇంగ్లీష్ సినిమాల్లా స్టైలిష్‌గా యాక్షన్ చేయడం సర్దార్ 2 సినిమాతో తీరింది : హీరో కార్తీ

Vaishnavi : ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్ ను కుటుంబ ప్రేక్షకులు కూడా చూడొచ్చు : వైష్ణవి చైతన్య

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ సీజన్ 10.. డబుల్ లేదా ట్రిపుల్ ఎలిమినేషన్?

ఇండస్ట్రీలో త్రిష వంటి వ్యక్తులు చాలా అరుదు : మాళివికా మోహనన్

తర్వాతి కథనం
Show comments