బుధవారం, 25 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 25 నవంబరు 2017 (17:00 IST)

నాగ్‌పూర్ టెస్ట్ : భారత కుర్రోళ్ళ సెంచరీలు.. ఆధిక్యంలో కోహ్లీ సేన

నాగ్‌పూర్ టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఆటగాళ్లు సెంచరీల మోత మోగించారు. ఓపెనర్ మురళీ విజయ్ (128), ఫస్ట్ డౌన్ బ్యాట్స్‌మెన్ చటేశ్వర్ పుజారా (121 నాటౌట్) సెంచరీ చేయడంతో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో రెండో రోజు ఆ

నాగ్‌పూర్ టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఆటగాళ్లు సెంచరీల మోత మోగించారు. ఓపెనర్ మురళీ విజయ్ (128), ఫస్ట్ డౌన్ బ్యాట్స్‌మెన్ చటేశ్వర్ పుజారా (121 నాటౌట్) సెంచరీ చేయడంతో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో రెండో రోజు ఆటముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసింది. క్రీజ్‌లో పుజారా, విరాట్ కోహ్లీ (54 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు. దీంతో భారత్ భారీ స్కోరు దిశగా దూసుకెళుతోంది. 
 
అంతకుముందు రెండో రోజు 11/1 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఆట ప్రారంభించిన టీమిండియా బ్యాట్స్‌మెన్‌ విజయ్‌, పుజారాలు క్రీజులో పాతుకుపోయారు. మురళీ విజయ్ చూడ‌చ‌క్క‌ని షాట్ల‌తో 187 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్‌తో త‌న‌ కెరీర్‌లో 10వ సెంచరీ పూర్తి చేసుకోగా, మ‌రో బ్యాట్స్‌మెన్ చ‌టేశ్వ‌ర పుజారా 246 బంతుల్లో 100 ప‌రుగులు బాది త‌న‌ కెరీర్‌లో 14వ‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
 
ప్ర‌స్తుతం క్రీజులో క్రీజులో పుజారా (108), విరాట్‌ కోహ్లీ (54) ఉన్నారు. టీమిండియా స్కోరు ప్ర‌స్తుతం 279/2(90 ఓవ‌ర్ల‌కి)గా ఉంది. టీమిండియా ఓపెన‌ర్లు లోకేశ్ రాహుల్ 7, ముర‌ళీ విజ‌య్ 128 ప‌రుగులు చేశారు. శ్రీలంక బౌల‌ర్ల‌లో గామేజ్, హెర‌త్‌ల‌కి చెరో వికెట్ ల‌భించాయి. శ్రీలంక జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 205 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెల్సిందే.