బుధవారం, 8 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 25 నవంబరు 2017 (15:16 IST)

#IndvSL : మురళీ విజయ్ ఔట్.. సెంచరీకి చేరువగా పుజారా

నాగ్‌పూర్ వేదికగా ప్రత్యర్థి శ్రీలంక జట్టుతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఆకట్టుకుంది. తొలిరోజు శ్రీలంకను 202 పరుగుల వద్ద ఆలౌట్ చేసిన భారత జట్టు రెండో రోజు బ్యాటింగ్‌లో నిలకడ ప్రదర్శించింది.

నాగ్‌పూర్ వేదికగా ప్రత్యర్థి శ్రీలంక జట్టుతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఆకట్టుకుంది. తొలిరోజు శ్రీలంకను 202 పరుగుల వద్ద ఆలౌట్ చేసిన భారత జట్టు రెండో రోజు బ్యాటింగ్‌లో నిలకడ ప్రదర్శించింది. ఓపెనర్ మురళీ విజయ్, ఛటేశ్వర్ పుజారాలు సెంచరీలతో కదంతొక్కారు. ఫలితంగా శ్రీలంక బౌలర్లు వికెట్లు తీసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 
 
ఈ మ్యాచ్‌లో ఓపెనర్ మురళీ విజయ్ అదరగొట్టాడు. తన కెరీర్‌లో 10వ సెంచరీని నమోదు చేశాడు. మొత్తం 187 బంతులను ఎదుర్కొన్న మురళీ విజయ్... 9 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో ఈ ఘనతను సాధించి, ప్రస్తుతం 128 పరుగుల వద్ద హెరాత్ బౌలింగ్‌లో పెరారేకు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. 
 
మరోవైపు అవతర ఎండ్‌లో ఉన్న చటేశ్వర్ పుజారా 88 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. ప్రస్తుతం టీమిండియా స్కోరు రెండు వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. దీంతో భారత్ 17 పరుగుల ఆధిక్యాన్ని కూడబెట్టుకుంది. అంతకుముందు ఓపెనర్ కేఎల్ రాహుల్ 7 పరుగులు చేసిన విషయం తెల్సిందే.