శుక్రవారం, 22 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 18 జూన్ 2024 (19:23 IST)

వివాదంలో పాక్ ఫాస్ట్ బౌలర్ హరీస్ రౌఫ్.. ఏమైంది?

Haris Rauf
Haris Rauf
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో బాబర్ అజామ్ సారథ్యంలోని పాకిస్థాన్ క్రికెట్ జట్టు గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హరీస్ రౌఫ్ భిన్నమైన వివాదంలో చిక్కుకున్నాడు. అతని వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది. 
 
అందులో అతడు గొడవ ప‌డుతూ కనిపించాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో హరీస్ రవూఫ్ తన భార్యతో కలిసి కనిపిస్తున్నాడు. ఈ క్రమంలో ఓ అభిమానితో వాగ్వాదానికి దిగాడు. హరీస్ హఠాత్తుగా భార్య చేయి విడిపించుకుని ఫ్యాన్ వైపు పరుగెత్తడం వీడియోలో కనిపిస్తోంది. బాబర్ అజామ్ నేతృత్వంలోని జట్టు గ్రూప్ దశలో అమెరికా, భారత్‌తో మ్యాచ్‌ల‌లో ఓడిపోవడంతో టోర్నమెంట్ నుండి త్వరగా నిష్క్రమించాల్సి వచ్చింది.
 
ఇకపోతే.. పాకిస్థాన్ టీ20 జట్టుకు కొత్త కెప్టెన్‌ను నియమిస్తే బాబర్ ఆజమ్‌ జట్టులో చోటుకు అర్హుడు కూడా కాదని వీరేంద్ర సెహ్వాగ్ విమర్శించాడు. ఒక కెప్టెన్‌గా తన ఆట జట్టుకు ఉపయోగపడుతుందో లేదో ఆలోచించుకోవాలని, టీ20 క్రికెట్‌లో బాబర్ ప్రదర్శన, స్ట్రైక్-రేట్ అంత గొప్పగా లేవని ప్రస్తావించాడు.