శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 23 జులై 2017 (15:10 IST)

భారత క్రికెట్ కన్సల్టెంట్‌ ఆఫర్‌ను తిరస్కరించిన ద్రవిడ్ : వినోద్ రాయ్

భారత క్రికెట్ జట్టుకు కన్సల్టెంట్‌గా ఉండలేనని క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్ స్పష్టం చేశాడు. టీమిండియా కోచ్‌గా అనిల్ కుంబ్లే రాజీనామా చేసిన తర్వాత భారత క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి ఎన

భారత క్రికెట్ జట్టుకు కన్సల్టెంట్‌గా ఉండలేనని క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్ స్పష్టం చేశాడు. టీమిండియా కోచ్‌గా అనిల్ కుంబ్లే రాజీనామా చేసిన తర్వాత భారత క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి ఎన్నికయ్యాడు. దీంతో టీమిండియాకు బ్యాటింగ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్‌ను తొలుత ప్రకటించి, ఆపై శాస్త్రి ఒత్తిడితో వెనక్కి తగ్గి, విదేశీ పర్యటనలకు ఆయన కన్సల్టెంట్‌గా ఉంటారని బీసీసీఐ చెప్పింది. 
 
అయితే, ఈ ఆఫర్‌ను రాహుల్ ద్రావిడ్ తిరస్కరించాడు. టీమిండియాకు తాను కన్సల్టెంట్‌గా ఉండలేనని ఆయన తేల్చి చెప్పినట్టు కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ చీఫ్ వినోద్ రాయ్ వెల్లడించారు.
 
ఇక జహీర్ ఖాన్ కాంట్రాక్టు విషయం ఇంకా తేలలేదని ఆయన అన్నారు. ద్రవిడ్ భారత ఏ టీమ్ కు, అండర్ 19 టీమ్ కు మాత్రమే కొనసాగుతూ ఉంటారని, సీనియర్ టీమ్‌తో విదేశాలకు వెళ్లే ఉద్దేశం, ఆలోచన లేవని బీసీసీఐ అధికారులతో జరిగిన సమావేశంలో రాయ్ వెల్లడించారు.