ఆస్పత్రిలో చేరిన రవీంద్ర జడేజా. త్వరగా కోలుకోవాలనీ...
భారత్ క్రికెటర్ రవీంద్ర జడేజా ఆస్పత్రిలో చేరాడు. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ టోర్నీలో పాకిస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 35 పరుగులతే రాణించాడు. అయితే, హాంకాంగ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో జడేజా మోకాలికి గాయమైంది. ఆయన్ను పరీక్షించిన వైద్యులు ఆపరేషన్ చేయాలని సూచించారు. ఫలితంగా ఆయన ఆస్పత్రిలో చేరి మాకాలికి ఆపరేషన్ చేయించుకున్నాడు. ఈ కారణంగా రవీంద్ జడేజా ఈ టోర్నీ నుంచి అర్థాంతరంగా తప్పుకున్నాడు.
జడేజా మోకాలికి ఆపరేషన్ చేయడంతో ఆయన త్వరలో జరుగనున్న ఐసీసీ వరల్డ్ టీ20 కప్ మెగా ఈవెంట్‌లో ఆడటం అనుమానాస్పదంగా మారింది. గాయానికి చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరి జడేజా ఫోటోలను ఐపీఎల్ ఫ్రాంచైజీ అయిన చెన్నై సూపర్ కింగ్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. గాయం నుంచి జడేజా త్వరగా కోలుకోవాలని, అతడు మున్ముందు మరిన్ని కీలక మ్యాచ్‌లు ఆడాల్సి ఉందంటూ ట్వీట్ చేసింది.