మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : బుధవారం, 2 జనవరి 2019 (18:59 IST)

నా భార్యతో సినిమాకు వెళ్లాలి. నా పిల్లల్ని చూసుకుంటావా?

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ టిమ్ పెయిన్ విసిరిన సవాలును భారత టెస్టు క్రికెటర్ రిషబ్ పంత్ స్వీకరించాడు. ప్రస్తుతం ఈ సవాలుకు సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ఆస్ట్రేలియాలో భారత్ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా భారత్ ఆతిథ్య కంగారూలతో నాలుగు టెస్టుల సిరీస్‌ను ఆడుతోంది. ఇప్పటికే ముగిసిన మూడు టెస్టుల్లో భారత్ ఆధిక్యంలో వుంది. 
 
ఈ నేపథ్యంలో మెల్‌బోర్న్‌లో జరిగిన టెస్టులో రిషబ్ పంత్‌ను ఆసీస్ కెప్టెన్ పెయిన్ వివాదానికి లాగాడు. ''ధోనీ రాకతో నిన్ను వన్డే నుంచి తొలిగించారు. బిగ్ బాష్ లీగ్‌లో నిన్ను చేర్చేనా'' అని అడిగాడు. ''నా భార్యతో సినిమాకు వెళ్లాలి. నా పిల్లల్ని చూసుకుంటావా?" అని సవాల్ విసిరాడు. ఇలా టిమ్ విసిరిన సవాలుకు రిషబ్ పెయిన్‌ పాపను ఎత్తుకున్నాడు. ఈ మేరకు టిమ్ పిల్లలతో రిషబ్ పంత్ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఈ ఫోటోలో టిమ్ పెయిన్ ఓ పాపను తన చేతులో వుంచుకుంటే.. ఇంకో పాపను టిమ్ భార్య తన చేతులో వుంచుకున్నారు. తద్వారా తన పాపను చూసుకుంటావా అనే టిమ్ ప్రశ్నకు.. తానేమీ తక్కువ కాదంటూ రిషబ్ నిరూపించాడు.