శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 2 మే 2017 (17:24 IST)

నాడు స్కూలు ఫీజు చెల్లించలేని క్రికెటర్.. నేడు రూ.30 కోట్ల విలువ చేసే విల్లా కొన్నాడు...

భారత క్రికెట్ జట్టులో చోటుదక్కించుకోవాలని ప్రతి వర్ధమాన క్రికెటర్ చిరకాల స్వప్నం. ఒక్క మ్యాచ్ ఆడక పోయినా ఫర్లేదు.. భారత జట్టులో ఎంపికైతే చాలు అనుకునే వర్ధమాన క్రికెటర్లు అనేకం. ఇందుకోసం అహర్నిశలు కృషి

భారత క్రికెట్ జట్టులో చోటుదక్కించుకోవాలని ప్రతి వర్ధమాన క్రికెటర్ చిరకాల స్వప్నం. ఒక్క మ్యాచ్ ఆడక పోయినా ఫర్లేదు.. భారత జట్టులో ఎంపికైతే చాలు అనుకునే వర్ధమాన క్రికెటర్లు అనేకం. ఇందుకోసం అహర్నిశలు కృషి చేస్తారు. చిన్నవయసులో చేతిలో చిల్లిగవ్వలేని క్రికెటర్లు ఎంతో మంది భారత జట్టులో ప్లేస్ దక్కా... రాత్రికి రాత్రే కోటీశ్వరులైన పోయిన సంఘటనలు అనేక ఉన్నాయి. అలాంటి వారిలో రోహిత్ శర్మ ఒకరు. 
 
భారత క్రికెట్ జట్టులో స్టార్ ఆటగాడు. అలాగే, ఐపీఎల్‌లోనూ మార్మోగుతున్న పేరు. కొన్నేళ్లుగా భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ పరుగుల సునామీ... ఇటీవలే 30వ యేట అడుగుపెట్టాడు. క్రికెట్లోకి వచ్చాక అతడి ప్రదర్శనకు తగ్గట్టుగానే సంపద కూడా పెరిగింది. తాజాగా ముంబైలో అత్యంత సంపన్నులు నివసించే వర్లి ప్రాంతంలో... రూ.30 కోట్ల ఖరీదైన 4-బెడ్రూం ఫ్లాట్‌ను ఈ క్రికెటర్ కొనుగోలు చేశాడు.
 
మొత్తం 5700 చదరపు అడుగుల సువిశాలమైన ఈ ఫ్లాట్‌లో... మినీ థియేటర్ మొదలు మీటింగ్ హాల్స్ వరకు హైప్రొఫైల్ వ్యక్తులకుండే సౌకర్యాలన్నీ ఉంటాయి. ఒకప్పుడు స్కూల్ ఫీజు చెల్లించేందుకు అనేక ఇబ్బందులు పడిన రోహిత్.. నిరుపేద కుటుంబంలో పుట్టాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎక్కువగా తన అమ్మమ్మ తాతయ్యలతో పాటు మేనమామ దగ్గర కూడా పెరిగాడు. అత్యంత ఇరుకైన ఇంట్లో జీవనం సాగించిన రోహిత్... తాజాగా తన కుటుంబం మొత్తానికి సరిపడినంత విశాలమైన అపార్ట్‌మెంటులోకి మారనున్నాడు.