బుధవారం, 25 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 4 జనవరి 2021 (13:55 IST)

ఐసోలేషన్: ఆ ఐదుగురు క్రికెటర్లకు కరోనా నెగటివ్..

మెల్‌బోర్న్‌లోని ఓ రెస్టారెంట్‌కు వెళ్ళిన ఐదుగురు క్రికెటర్స్ భోజనం చేస్తుండగా.. పక్క టేబుల్‌పైన ఉన్న నవల్‌దీప్‌ సింగ్‌ అనే అభిమాని వీరి బిల్లు చెల్లించాడు. ఇందుకు గాను రిషబ్ పంత్‌.. నవల్‌దీప్‌ని హగ్ చేసుకున్నట్టు బీసీసీఐ గుర్తించడంతో ఐదుగురిని ఐసోలేషన్‌కు పంపారు. 
 
భారత వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, రిషబ్‌ పంత్‌, నవ్‌దీప్‌ సైనీ, పృథ్వీ షా బయో సెక్యూరిటీ ప్రోటోకాల్‌ని ఉల్లంఘించడంతో వారిని ఐసొలేషన్‌కు పంపినట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో... తాజాగా రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, రిషబ్‌ పంత్‌, నవ్‌దీప్‌ సైనీ, పృథ్వీ షాలతో పాటు మిగతా ఇండియన్ క్రికెటర్స్‌, సిబ్బందికి ఆర్‌పీసీఆర్ కరోనా పరీక్షలు నిర్వహించగా అందరికి నెగెటివ్ అని తేలింది. దీంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.