ఆదివారం, 5 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 28 నవంబరు 2022 (16:19 IST)

ఓవర్‌లో ఆరు బంతులు.. ఏడు సిక్స్‌లు బాదిన రుతురాజ్ గైక్వాడ్

ruturaj guikwad
అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు ఏ ఒక్క క్రికెటర్ సాధించని అరుదైన ఘనత భారతీయ క్రికెట్ రుతురాజ్ గైక్వాడ్ సాధించాడు. ఒక ఓవర్‌లో ఆరు బంతులు ఉండగా, ఏడు సిక్స్‌లు బాదాడు. ఈ అద్భుత దృశ్యం విజయ్ హజారే ట్రోఫీలో ఆవిష్కృతమైంది. 
 
భారత క్రికెట్ జట్టు క్రికెటర్, మహారాష్ట్ర ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ యూపీపై మెరుపు డబుల్ సెంచరీ చేశాడు. 159 బంతుల్లో ఏకంగా 220 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఒకే ఓవర్‌లో ఏడు సిక్స్‌లు బాది సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. 
 
యూపీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శివ్‌సింగ్ బౌలింగ్‌లో ఈ ఘనతను సాధించాడు. ఈ ఓవర్‌లో ఐదో బంతి నోబాల్‌గా పడటంతో శివ్‌సింగ్ అదనంగా మరో బంతిని సంధించాల్సి వచ్చింది. దాన్ని కూడా రుతురాజ్ సిక్స్‌గా మలిచాడు. 
 
ఇక ఓవర్ చివరిదైన ఆరో బంతిని కూడా స్టాండ్స్‌కు పంపించాడు. దీంతో ప్రపంచ క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో ఏడు సిక్స్‌లు బాదిన ఏకైక క్రికెటర్‌గా రుతురాజ్ గైక్వాడ్ చరిత్రపుటల్లో నిలిచిపోయాడు.