శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 8 సెప్టెంబరు 2017 (11:36 IST)

చదువుల్లో మంచి స్కోర్ చేయలేకపోయానంటున్న క్రికెట్ దిగ్గజం!

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన చదువుపై ఓ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. దీనికి ఓ ఫోటో జత చేశాడు. ఆ ఫోటోకు ఓ వెరైటీ క్యాప్ష‌న్ ఇచ్చాడు. చిన్న‌పిల్ల‌వాడిగా ఉన్న‌ప్పుడు ఓ పుస్త‌కం ప‌ట్టుకుని దిగిన ఫోటో

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన చదువుపై ఓ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. దీనికి ఓ ఫోటో జత చేశాడు. ఆ ఫోటోకు ఓ వెరైటీ క్యాప్ష‌న్ ఇచ్చాడు. చిన్న‌పిల్ల‌వాడిగా ఉన్న‌ప్పుడు ఓ పుస్త‌కం ప‌ట్టుకుని దిగిన ఫోటో అది. అది చూసిన నెటిజన్లు ఇపుడు తెగ లైక్ చేస్తున్నారు.
 
ఇంత‌కీ ఆ ఫోటోకు ఏం క్యాప్ష‌న్ ఇచ్చాడో తెలుసా. ఆట‌లో ముందుండే స‌చిన్‌.. చ‌దువుల్లో మాత్రం మంచి మార్క్‌లు స్కోర్ చేయ‌లేద‌ట‌. ఆ విష‌యాన్ని త‌న ఫోటో క్యాప్ష‌న్ ద్వారా చెప్పేశాడు. పుస్త‌కం ప‌ట్టుకుని ఉన్నా, ఆ రంగంలో స్కోర్‌ను ప‌రుగెత్తించ‌డంలో వెనుక‌బ‌డి ఉన్న‌ట్లు మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ తెలిపారు. 
 
చిన్న‌త‌నంలో తానో అల్ల‌రి పిల్ల‌వాడిన‌ని, పేరెంట్స్‌ను చాలా ఇబ్బంది పెట్టేవాడిన‌ని గ‌తంలో స‌చిన్ చెప్పేవాడు. కాగా, 1989లో అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన స‌చిన్ దాదాపు 200 టెస్టులు ఆడాడు. ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్‌లో స‌చిన్‌ 34347 ర‌న్స్ చేశాడు. అందులో వంద సెంచ‌రీలు కూడా ఉన్నాయి. టెస్టుల్లో 51, వ‌న్డేల్లో 49 సెంచ‌రీలు చేసిన సచిన్... 2013లో స‌చిన్ అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు.