సోమవారం, 2 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (19:18 IST)

స్కాట్లాండ్ బౌలర్లు బెంబేలెత్తింపజేశారు.. 24 పరుగులకే ఆలౌట్..

స్కాట్లాండ్‌తో జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో ఒమెన్ జట్టు 24 పరుగులకు అన్నీ వికెట్లు కోల్పోయి ఘోర పరాజయం పాలైంది. ఒమెన్‌కు పర్యటన చేపట్టిన స్కాట్లాండ్ జట్టు మూడు వన్డే మ్యాచ్‌లతో కూడిన సిరీస్‌లో ఆడుతోంది. ఇందులో భాగంగా అమరాథ్ ప్రాంతంలో జరిగిన తొలి వన్డేలో స్కాట్లాండ్ అద్భుతమై ఆటతీరును ప్రదర్శించింది. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన స్కాట్లాండ్ బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన ఒమన్ జట్టు క్రికెటర్లు స్కాట్లాండ్ బౌలింగ్ బెంబేలెత్తిపోయారు. స్కాట్లాండ్ బౌలర్ల ధాటికి.. వెంట వెంటనే పెవిలియన్ దారిపట్టారు. ఈ క్రమం 17.1 ఓవర్లలో ఒమెన్ 24 పరుగులకే ఆలౌటైంది. ఒమెన్ జట్టులో 15 పరుగులు మాత్రమే అత్యధిక పరుగులుగా నమోదైంది. 
 
ఇంకా నలుగురు బ్యాట్స్‌మెన్లు ఒకే ఒక పరుగు వద్ద, ఐదు బ్యాట్స్‌మెన్లు పరుగులేమీ లేకుండా అవుట్ అయ్యారు. దీంతో కేవలం 25 పరుగుల అతి స్వల్ప పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్ 3.2 ఓవర్లలో 26 పరుగులు సాధించి పది వికెట్ల తేడాతో అలవోకగా విజయం సాధించింది.