గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Modified: సోమవారం, 18 ఫిబ్రవరి 2019 (20:26 IST)

శృంగారం చేస్తుంటే నా భార్యకు బీపీ పెరుగుతోంది... కాళ్లూ-చేతులు చల్లబడుతున్నాయి...

మాకు వివాహమై పదేళ్లు అయింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత కొన్ని రోజులుగా శృంగారం చేస్తున్న సమయంలో నేను శిఖరాగ్ర స్థాయికి వెళ్లినప్పుడు ఆమె శరీరం చల్లబడి పోతూ.. బీపీ పెరుగుతోంది. ఆమెకు అలా అవుతుండటంతో నేను చల్లబడిపోతున్నాను. ఆమెను అలా చూస్తుంటే భయమేస్తోంది. దీనికి కారణమేంటి. ఇలా ఎందుకు జరుగుతుంది? 
 
సాధారణంగా ఇలాంటి పరిస్థితి ఏ మహిళకు రాదు. ఐతే కొందరిలో విపరీతమైన భయం చోటుచేసుకుంటే ఇటువంటి పరిస్థితి కలుగవచ్చు కానీ అది పెళ్లయిన తొలినాళ్లలో కనబడవచ్చు. మీ విషయంలో ఆమె ఆరోగ్యాన్ని చెక్ చేయించాల్సిన అవసరం వుంది. పైకి ఆరోగ్యంగా ఉన్నట్టు కనిపిస్తున్నా ఆమెలో అనారోగ్య సమస్యలు ఉండొచ్చు. 
 
అలాగే, శృంగారం చేస్తున్న సమయంలో పిల్లలు చూస్తారేమోనన్న భయం ఉన్నప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమయ్యే అవకాశం లేకపోలేదు. అందువల్ల తక్షణం ఆమెను వైద్యుని వద్దకు తీసుకెళ్లి పూర్తి ఆరోగ్య పరీక్షలు చేయించండి. ఆ తర్వాత విషయాన్ని చెప్పి తగు సలహాలు తీసుకోండి.