శనివారం, 23 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 16 నవంబరు 2018 (14:23 IST)

చాలామంది మనసులో వున్న మాటను అఫ్రిది చెప్పేశాడు-సామ్నా

పాకిస్థాన్‌లో వున్న నాలుగు ప్రావిన్స్‌లనే పాకిస్థాన్ సర్కారు సరిగ్గా పాలించలేకపోతుందని.. అలాంటప్పుడు పాకిస్థాన్‌కు కాశ్మీర్ ఎందుకని ప్రశ్నించిన పాక్ క్రికెటర్ షాహిద్ అఫ్రిది వ్యాఖ్యలపై శివసేన పార్టీ పత్రిక సామ్నా ప్రశంసించింది.


పాకిస్థాన్ ప్రభుత్వంతో పాటు అక్కడి సైన్యం తమ దేశ పరిపాలనను పక్కనబెట్టి భారత్‌ను ఏ విధంగా దెబ్బకొట్టాలనే దానిపై 70 సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తూనే వున్నారని అభిప్రాయం వ్యక్తం చేసింది. 
 
ఇది ఆ దేశ ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపిందని.. అందుచేత ఆ దేశంలోని విచక్షణ కలిగిన పౌరులు కాశ్మీర్ విషయంలో అంత సానుకూలంగా లేరని వ్యాఖ్యానించింది.

ఉగ్రవాదాన్ని పెంచి పోషించడంతో పాటు పాకిస్థాన్ పేదరికంలో కూరుకుపోయిందని.. ఏకంగా దేశ ప్రధాని ఆఫీస్ పశువులు, కార్లు అమ్మే కేంద్రంగా మారిందని సామ్నా పత్రిక ఎద్దేవా చేసింది. 
 
కానీ అఫ్రిది మాత్రం సామ్నా పత్రిక భారత వ్యతిరేకిగా పేర్కొంది. అనేక సందర్భాల్లో అతను దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడని సామ్నా తెలిపింది.

గతంలో భారత సైన్యం 13 మంది తీవ్రవాదాలను హతమార్చిన సందర్భంలోనూ కాశ్మీర్ స్వాతంత్ర్యం విషయంలోనూ అఫ్రిది భారత్‌నే తప్పుబడుతున్నాడని సామ్నా స్పష్టం చేసింది.