మంగళవారం, 26 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 12 నవంబరు 2020 (11:36 IST)

టీమ్ ఇండియా ఈజ్ బ్యాక్ ఫర్ నేషన్ డ్యూటీ... దుబాయ్ టు సిడ్నీ!

బీసీసీఐకు కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నీ ముగిసింది. ఈ టోర్నీలో వివిధ ఫ్రాంచైజీల మైదానంలో తమ శక్తియుక్తులను ధారపోసిన భారత క్రికెటర్లు.. ఇపుడు ఒక్కటయ్యారు. టీమ్ ఇండియాగా అవతరించారు. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే భారత క్రికెట్ జట్టులోని సభ్యులంతా టీమ్ ఇండియాగా అవతరించారు. "టీమ్ ఇండియా ఈజ్ బ్యాక్" అంటూ పేపర్లకు ఫోజులిచ్చారు. 
 
అంటే, ఐపీఎల్ టోర్నీ ముగిసిన తర్వాత వివిధ ఫ్రాంజైల కోసం ఆడిన భారత క్రికెటర్లు ఇపుడు నేషన్ డ్యూటీ కోసం సిద్ధమయ్యారు. రెండు నెలలకుపైగా సాగే ఆస్ట్రేలియా పర్యటన కోసం కెప్టెన్‌‌ విరాట్‌‌ కోహ్లీ, ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఆధ్వర్యంలోని టీమ్‌‌ బుధవారం రాత్రి దుబాయ్‌‌ నుంచి సిడ్నీ​ బయలుదేరింది. ఐపీఎల్​ ఫినిష్​ చేసుకుని మంగళవారం రాత్రికే ఒక్కచోటకు చేరిన టీమిండియా క్రికెటర్లంతా ప్రత్యేకంగా డిజైన్‌‌ చేసిన పీపీఈ కిట్లు ధరించి ఫ్లైట్​ ఎక్కారు. ఆగస్టు చివరి వారం నుంచి యూఏఈలో బయో బబుల్‌‌లో గడిపిన క్రికెటర్లు.. ఆసీస్‌‌లో అడుగుపెట్టిన వెంటనే మళ్లీ బబుల్‌‌లోకి వెళ్లనున్నారు.
 
కాగా, స్టార్‌‌ బ్యాట్స్‌‌మన్‌‌ రోహిత్‌‌ శర్మ మాత్రం ఇండియాకు తిరుగుపయనమయ్యాడు. బెంగళూరులోని ఎన్‌‌సీఏలో రిహాబిలిటేషన్‌‌ అనంతరం టెస్ట్‌‌ సిరీస్‌‌ నాటికి ఆసీస్‌‌ చేరుకుంటాడు. గాయంతో బాధపడుతున్న సీనియర్‌‌ వికెట్‌‌ కీపర్‌‌ బ్యాట్స్‌‌మన్‌‌ వృద్ధిమాన్‌‌ సాహా మాత్రం ఆసీస్‌‌ ఫ్లైట్‌‌ ఎక్కాడు. ఈ టూర్‌‌లో ఇండియా, ఆస్ట్రేలియా మధ్య వరుసగా 3 వన్డేలు, 3 టీ20లు, 4 టెస్ట్‌‌ మ్యాచ్‌‌లు జరుగుతాయి.