బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 12 జనవరి 2023 (09:07 IST)

నాలుగేళ్ళ తర్వాత ఉప్పల్‌లో క్రికెట్ మ్యాచ్ - ఆన్‌లైన్‌లో టిక్కెట్ల విక్రయం

azaruddin
హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ స్టేడియంలో నాలుగేళ్ల తర్వాత ఒక అంతర్జాతీయ వన్డే క్రికెట్ మ్యాచ్ ఈ నెల 18వ తేదీన జరుగనుంది. ఆతిథ్య భారత్, పర్యాటక న్యూజిలాండ్ జట్లు తలపడే ఈ మ్యాచ్ కోసం స్టేడియాన్ని సిద్ధం చేశారు. ఈ మ్యాచ్ కోసం ఈ నెల 13వ తేదీ నుంచి ఆన్‌లైన్‌‍లోనే టిక్కెట్లను విక్రయిస్తామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అజారుద్దీన్ తెలిపారు. మ్యాచ్ జరిగే స్టేడియం వద్ద ఒక్క టిక్కెట్ కూడా విక్రయించమని ఆయన స్పష్టం చేశారు.
 
ఇదే అంశంపై ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఈ నెల 18వ తేదీ భారత్, శ్రీలంక జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరుగుతుందన్నారు. ఈ మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. టిక్కెట్ల అమ్మకాలు ఈ నెల 13వ తేదీ నుంచి జరుగుతాయని చెప్పారు. కేవలం ఆన్‌లైన్‌లో పేటీఎంలో మాత్రమే టిక్కెట్లు విక్రయానికి అందుబాటులో ఉంచినట్టుతెలిపారు. 
 
అయితే, ఎల్బీ స్టేడియం, గచ్చిబౌలి స్టేడియంలో ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఫిజికల్ టిక్కెట్లను తీసుకోవాల్సి ఉంటుందన్నారు. జనవరి 14న న్యూజిలాండ్ జట్టు, 16వ తేదీన భారత జట్లు హైదరాబాద్ నగరానికి వస్తాయని, 15న స్టేడియంలో న్యూజిలాండ్ జట్టు ప్రాక్టీస్ చేస్తుందని 17న ఇరు జట్లు కలిసి ప్రాక్టీస్ చేస్తాయని, 18వ తేదీన వన్డే మ్యాచ్ జరుగుతుందని తెలిపారు.