గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 11 జనవరి 2023 (16:27 IST)

హాలీవుడ్ దర్శకులతో పనిచేయాలని వుంది.. రామ్ చరణ్

RRR
RRR
ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ రేసుకు సిద్ధమైంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ లోని నాటు సాంగుకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు లభించింది. గోల్డెన్ గ్లోబ్స్ లో మెగా పవర్ స్టార్ చెర్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ సినిమా నిర్మాణంలో పడిన కష్టాల గురించి చెప్పుకొచ్చారు. చెర్రీ, రాజమౌళి, ఎన్టీఆర్ రెడ్ కార్పెట్ పై కనిపించారు. దేశీ లుక్ లో అదరగొట్టారు.
 
జూనియర్ ఎన్టీఆర్ క్లాసిక్ లుక్ అదిరింది. కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్ లో గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతోంది. ఈ అవార్డును ఇప్పటికే నాటు నాటు సాంగ్ కైవసం చేసుకుంది. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాటకు ఈ అవార్డు దక్కింది. చెర్రీ, ఎన్టీఆర్, కీరవాణి, రాజమౌళి తమ సతీమణులతో తళుక్కుమన్నారు. 
 
ఈ సందర్భంగా చెర్రీ మాట్లాడుతూ.. మార్వెల్ లో అవకాశం వస్తే చేస్తానని స్పష్టం చేశారు. ఈ వేడుకకు ముందు రామ్ చరణ్ వెరైటీ మ్యాగజైన్‌కు చెందిన మార్క్ మాల్కిన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. మార్వెల్ స్టూడియోస్ నుంచి కాల్ వస్తే చేస్తారా అని అడుగ్గా.. తప్పకుండా అంటూ రామ్ చరణ్ బదులిచ్చారు.
 
"హాలీవుడ్‌లోని సాంకేతిక నిపుణులు, దర్శకులు మమ్మల్ని అభినందించాలని తాను కోరుకుంటున్నానని తెలిపారు. హాలీవుడ్ సినిమా ప్రపంచంతో కలిసి పనిచేయాలని కోరుతున్నట్లు వెల్లడించారు. నాటు నాటుకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గెలుపొందినందుకు హర్షం వ్యక్తం చేశారు.