ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 27 ఫిబ్రవరి 2017 (17:40 IST)

విరాట్ కోహ్లీకి ఇక కష్ట కాలమే.. హెచ్చరిస్తున్న మైకేల్ క్లార్క్

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఇకపై కష్టకాలమేనని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ హెచ్చరించాడు. ఇంగ్లండ్ జట్టుపై గెలిచిన ఊపులో ఆస్ట్రేలియా జట్టుపై కూడా సునాయాసంగా గెలుపు సాధించవచ్చుననే అత

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఇకపై కష్టకాలమేనని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ హెచ్చరించాడు. ఇంగ్లండ్ జట్టుపై గెలిచిన ఊపులో ఆస్ట్రేలియా జట్టుపై కూడా సునాయాసంగా గెలుపు సాధించవచ్చుననే అతి విశ్వాసంగా ఉండిన కోహ్లీ సేనకు.. ఆస్ట్రేలియా గండికొట్టింది. తొలి టెస్టులో కోహ్లీ సేనను కంగారూలు చిత్తు చిత్తుగా ఓడించారు. దీనిపై క్లార్క్ మాట్లాడుతూ.. భారత్‌తో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా అద్భుతంగా ఆడిందన్నాడు. 
 
తనవరకైతే కోహ్లీకి అసలైన కష్టకాలం ఈ టెస్టు మ్యాచ్‌తోనే ప్రారంభమైందని చెప్పాడు. ఈ కష్టకాలం నుంచి గట్టెక్కేందుకు కోహ్లీనే చర్యలు తీసుకోవాలన్నాడు. ఇంతవరకు కోహ్లీ భుజస్కంధాలపై గెలిచిన టీమిండియాకు ఇకపై ఆటగాళ్ల సపోర్ట్ అవసరమన్నాడు. ఇదే రూలే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ కెప్టెన్లకని క్లార్క్ వ్యాఖ్యానించాడు. కోహ్లీ ఇకపై ఒంటి చేత్తో జట్టును నడపకుండా ఆటగాళ్లు మెరుగ్గా ఆడే దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆలోచించాలన్నాడు.