బుధవారం, 25 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 డిశెంబరు 2021 (16:18 IST)

అమ్మతోడు... రోహిత్‌తో కోల్డ్‌వార్‌లేదంటున్న విరాట్ కోహ్లీ

తనకు రోహిత్ శర్మకు మధ్య సాగుతున్న కోల్డ్ వార్‌పై భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలిసారి స్పందించారు. తనకు రోహిత్‌కు మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. అయితే, సౌతాఫ్రికా పర్యటన కోసం భారత జట్టును ఎంపిక చేసే విషయంపై కేవలం గంటన్నర ముందు మాత్రమే తనకు సమాచారం చేరవేశారని వెల్లడించారు.
 
ఇదే అశంపై ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ, టెస్ట్ జట్టును ఎంపిక చేసుకోవడానికి కేవలం గంటన్నర ముందు మాత్రమే తనను బీసీసీఐ సంప్రదించిందన్నారు. ఈ నెలాఖరులో భారత క్రికెట్ జట్టు సౌతాఫ్రికాలో పర్యటించనుంది. ఈ జట్టును ఇప్పటికే ప్రకటించింది. 
 
టెస్టు జట్టు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ, వన్డే జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మను ఎంపిక చేశారు. దీంతో వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తినట్టు వార్తలు వచ్చాయి. వాస్తవానికి రోహిత్, కోహ్లీల మధ్య కోల్డ్‌వార్ ఎప్పటి నుంచో జరుగుతోంది. 
 
దుబాయ్ వేదికగా జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌లో ఇవి తారా స్థాయికి చేరినట్టు వార్తలు వచ్చాయి. ఇపుడు వన్డే కెప్టెన్సీ నుంచి కోహ్లీని తప్పించి, రోహిత్‌ను ఎంపిక చేయడంతో ఇవి బహిర్గతమయ్యాయి.