శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 16 జనవరి 2017 (17:49 IST)

సచిన్ టెండూల్కర్‌లా నేనుండను... విరాట్ కోహ్లి షాకింగ్ కామెంట్...

టీమిండియా క్రికెట్ అన్నీ ఫార్మాట్లకు సారథిగా వ్యవహరిస్తున్న విరాట్ కోహ్లీ తన సక్సెస్‌కు అసలు కారణమేమిటో చెప్పేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో సారథ్యం చేపట్టిన తొలి వన్డేలోనే అద్భుతంగా రాణించి శతకాన్ని

టీమిండియా క్రికెట్ అన్నీ ఫార్మాట్లకు సారథిగా వ్యవహరిస్తున్న విరాట్ కోహ్లీ తన సక్సెస్‌కు అసలు కారణమేమిటో చెప్పేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో సారథ్యం చేపట్టిన తొలి వన్డేలోనే అద్భుతంగా రాణించి శతకాన్ని నమోదు చేసుకున్న విరాట్ కోహ్లీ.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఫలితంగా పుణె వేదికగా జరిగిన తొలి వన్డేలో ఇంగ్లాండ్‌ నిర్దేశించిన 351 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తన జీవితంలో ఆప్తులు, స్నేహితులు, సన్నిహితులు ఎక్కువ మంది లేకపోవడమే తన సక్సెస్‌కు కారణమన్నాడు. 
 
'అదృష్టవశాత్తూ నా జీవితంలో ఎక్కువ మంది సన్నిహితులు లేరు. అది నాకు సాయపడిందని అనుకుంటాను. మనం మాట్లాడాల్సిన స్నేహితులు, జనాలు ఎక్కువమంది ఉండటం సక్సెస్‌ భంగం కలిగిస్తుంది. సమయ నిర్వహణ కష్టమవుతుంది' అని అన్నాడు. ఎవరైనా సరే వారి లక్ష్యానికి పరిమితులు విధించుకోవద్దని ఉద్ఘాటించాడు. ఇంకా మాట్లాడుతూ, లక్ష్యానికి పరిమితులు విధించుకోవడం మంచిది కాదన్నాడు. తానెప్పుడూ తన సామర్థ్యాన్ని బాగా ప్రదర్శించాలని కోరుకుంటానని చెప్పుకొచ్చాడు. 
 
జీవితంలో సమతూకం ఏర్పరుచుకొని ముందుకెళ్లాలని కోహ్లి అన్నాడు. సచిన్ టెండూల్కర్‌తో పోలిక వద్దన్నాడు. ఆయన రికార్డులను బ్రేక్ చేయడం కష్టతరమన్నాడు. సచిన్‌లా సుదీర్ఘ కాలం తాను క్రికెట్లో కొనసాగకపోవచ్చునని కోహ్లీ వ్యాఖ్యానించాడు.