విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు... ఏంటది?

సోమవారం, 15 మార్చి 2021 (08:25 IST)
ఇటీవలే అత్యధిక సార్లు డకౌట్ అయిన భారత కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పిన విరాట్ కోహ్లీ.. ఇపుడు మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. పురుషుల అంతర్జాతీయ టీ20 పోటీల్లో 3 వేల పరుగులు సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ రికార్డు స్థాపించాడు. 
 
అమ్మదాబాద్‌లోని మోతేరా స్టేడియంలో ఆదివారం రాత్రి ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ ద్వారా కోహ్లీ ఈ ఘనత అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 49 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులతో 73 పరుగులు చేశాడు. మొత్తమ్మీద కోహ్లీ 87 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడి 3001 పరుగులతో నెం.1గా నిలిచాడు.
 
ఇక్కడ ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే... కోహ్లీ కంటే ముందే ఇద్దరు మహిళా క్రికెటర్లు అంతర్జాతీయ టీ20ల్లో 3 వేల మార్కును అందుకున్నారు. న్యూజిలాండ్‌కు చెంది సుజీ బేట్స్ (3,301), వెస్టిండీస్ క్రీడాకారిణి స్టెఫానీ టేలర్ (3,062) ఈ ఘనత సాధించారు. కాగా, ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ విజయభేరీ మోగించిన విషయం తెల్సిందే.
 
టీ20లో లెక్క సరిచేశారు... 
అహ్మదాబాద్‌లోని మోతేరా క్రికెట్ స్టేడియంలో భారత్ ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న ట్వంటీ20 సిరీస్‌లో లెక్క సమానమైంది. తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలుపొందగా, ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 164 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని కేవం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి మరో ఏడు బంతులు మిగిలివుండగానే, భారత్ చేదిందించింది. దీంతో ఐదు మ్యాచ్‌లో టీ20 సిరీస్ 1-1తో ఇరు జట్లూ సమఉజ్జీలుగా నిలిచాయి. 
 
అంతకుముందు ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఆ జట్టులో ఓపెనర్ జాసన్ రాయ్ 46, కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 28 పరుగులు చేశారు. మలాన్ 24, బెయిర్ స్టో 20 పరుగులు సాధించారు. టీమిండియా బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 2, శార్దూల్ ఠాకూర్ 2 వికెట్లు తీశారు. భువనేశ్వర్ కుమార్, చహల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
 
ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన భారత్.. స్కోరు బోర్డుపై ఒక్క పరుగు కూడా చేరకముందే ఓపెనర్ కేఎల్ రాహుల్ వికెట్ కోల్పోయింది. మొదట సున్నా పరుగులకే కేఎల్ రాహుల్ డకౌట్ అయినా.. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్(56: 32 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సులు)తో వీర విహారం చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. అతడికి కెప్టెన్ విరాట్ కోహ్లీ (నాటౌట్, 73: 49 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులు) కూడా తోడవడంతో టార్గెట్‌ ఛేజింగ్ మరింత సులభమైంది. 
 
తొలి టీ20లో డకౌట్ అయినప్పటికీ రెండో మ్యాచ్‌లో మాత్రం కోహ్లీ అదరగొట్టాడు. అజేయ అర్థ సెంచరీతో భారత్‌కు విజయాన్ని అందించాడు. వీరితో పాటు 4వ స్థానంలో బ్యాటింగ్ వచ్చిన రిషబ్ పంత్(26: 13 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులు) కూడా మెరుపులు మెరిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో శామ్ కర్రన్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్‌లు తలో వికెట్ తీసుకున్నారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ఇషాన్ కిషన్ అందుకున్నారు. 

అన్నీ చూడండి

పిల్లల్ని కనండి.. మూడో బిడ్డకు రూ. 30,000, నాలుగో బిడ్డకు రూ. 40,000 ఇస్తాం: చంద్రబాబు

సీఏ విద్యార్థి... మొదట నాలుక కోసుకున్నాడు.. తర్వాత లుంగీతో ఉరేసుకున్నాడు..

అద్దె చెల్లించలేక భార్య - కుమార్తెపై అత్యాచారానికి ఇంటి యజమానికి అనుమతిచ్చిన భర్త...

మూడు రాజధానులకు చెక్.. రూపు రేఖలు మార్చేసిన చంద్రబాబు.. భారీ ప్రాజెక్టులు

ఏసీ స్లీపర్ బస్సులో మంటలు.. తొక్కిసలాటలో సీటు కిందకి చిన్నారి.. సజీవ దహనం

అన్నీ చూడండి

ప్రకృతి గొప్పతనాన్ని తెలియజెప్పే కాన్సెప్ట్ తో జంగిల్ బుగి రియాల్టీ షో

విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ (Video)

చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే సమ్మర్ హాలిడేస్

Prasanth Varma: తేజ సజ్జ హనుమాన్ చిత్రం 3డిలో రీరిలీజ్ కాబోతోంది

'జయం' రవితో కెనీషా ఫ్రాన్సిస్ బ్రేకప్ - ఫెమినిజం గెలిచింది.. ఆనందం ఓడిపోయింది..

తర్వాతి కథనం
Show comments