సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 18 జులై 2023 (22:10 IST)

BHUMRA IS BACK: బుమ్రా హింట్ ఇచ్చాడుగా.. ఎమోషనల్ పోస్ట్ వైరల్

Jasprit Bumrah - kohli
టీమిండియా సూపర్ స్టార్ జస్‌ప్రీత్ బుమ్రా మళ్లీ జట్టులో కలవనున్నట్లు హింట్ ఇచ్చాడు. వెన్నులో గాయం కారణంగా చాలాకాలం పాటు క్రికెట్‌కు దూరమైన బుమ్రా.. ఆపరేషన్ తర్వాత కోలుకున్న బుమ్రా.. మరికొన్ని రోజుల్లో మళ్లీ టీమిండియాలో చోటు సంపాదించుకునే అవకాశాలున్నట్లు కనిపిస్తోంది. 
 
ఈ క్రమంలోనే తను త్వరలోనే టీమిండియా పునరాగమనం చేస్తానని బుమ్రా తాజాగా హింట్ ఇచ్చాడు. అంతేగాకుండా దీనికి తోడు ఓ ఎమోషనల్ వీడియోను పోస్టు చేశాడు. 
 
ఇందులో ప్రాక్టీస్ సెషన్స్‌కు సంబంధించిన ఫోటోలు వున్నాయి. దీనిని బట్టి బుమ్రా తిరిగి టీమిండియాలో జట్టులో చేరే అవకాశాలు లేకపోలేదని క్రీడా పండితులు చెప్తున్నారు.