శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 15 మార్చి 2023 (14:03 IST)

డ్యాన్స్ గ్రూప్‌తో డ్యాన్స్ ఇరగదీసిన విరాట్ కోహ్లీ

Kohli
Kohli
నార్వేజియన్ డ్యాన్స్ గ్రూప్ క్విక్ స్టైల్ ముంబై పర్యటనలో వుంది. ఈ సందర్భంగా ఈ టీమ్‌తో కలిసి విరాట్ కోహ్లీ స్టెప్పులేశాడు. టీమిండియా మాజీ కెప్టెన్ తన నృత్య కదలికలతో తన అభిమానులను అలరించారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోలో, డ్యాన్స్ గ్రూప్ సభ్యుల్లో ఒకరు క్రికెట్ బ్యాట్‌ను అందజేసినప్పుడు అయోమయంగా కనిపించారు. ఆపై డ్యాన్స్ ఇరగదీశాడు. 
 
కాగా "వెన్ విరాట్- క్విక్ స్టైల్" అనే శీర్షికతో నార్వేజియన్ డ్యాన్స్ గ్రూప్ ఈ వీడియోను మంగళవారం షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇప్పటికే ఈ వీడియోకు 21 మిలియన్లకు పైగా వ్యూస్ లభించాయి. ఈ వీడియో అదుర్స్ అంటూ హర్భజన్ సింగ్, కోహ్లీ భార్య అనుష్క శర్మ వంటి పలువురు ప్రముఖ క్రీడాకారులు కితాబిస్తున్నారు.