గురువారం, 26 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 23 నవంబరు 2022 (09:28 IST)

యువరాజ్ సింగ్‌కు షాకిచ్చిన గోవా అధికారులు

yuvraj villa
మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌కు గోవా అధికారులు షాకిచ్చారు. తమ ఎదుట హాజరుకావాలంటూ ఆదేశించారు. దీనికి బలమైన కారణం లేకపోలేదు. యువరాజ్‌ సింగ్‌కు గోవాలో విలాసవంతమైన విల్లా ఉంది. గోవా మోర్జిమ్ ప్రాంతంలో ఉన్న ఈ విల్లా పేరు 'కాసా సింగ్'. ఇపుడు ఈ విల్లాను అద్దెకు ఇస్తామంటూ యువరాజ్ సింగ్ ఆన్‌లైన్‌లో ఓ ప్రకటన చేశారు. ఇది ఒక విధంగా పేయింగ్ గెస్ట్ విధానం కిందకు వస్తుంది. దీనికి గోవా రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులు అభ్యంతరం తెలిపారు. 
 
పేయింగ్ గెస్ట్ విధానం కింద విల్లాను అద్దెకు ఇవ్వాలంటే గోవా రిజిస్ట్రేషన్ ఆఫ్ టూరిస్ట్ ట్రేడ్ యాక్ట్ 1982 ప్రకారం గోవా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, ఇక్కడ యూవీ ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండానే అద్దె ప్రకటన చేశారు. దీన్ని గోవా అధికారులు తప్పుబడుతూ రూ.లక్ష అపరాధం విధించారు. పైగా, తమ ఎదుటు హాజరై వివరణ ఇవ్వాలంటూ వారు నోటీసు జారీచేశారు.