"వాకా"పిచ్‌పై చేసిన సెంచరీనే కెరీర్లో అత్యుత్తమ ఇన్నింగ్స్: సచిన్
పెర్త్ నగరంలో 'వాకా' పిచ్‌పై సాధించిన సెంచరీనే తన కెరీర్లో అత్యుత్తమ ఇన్నింగ్స్ అని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అన్నాడు. 1992లో వాకా పిచ్‌పై చేసిన సెంచరీ తన కెరీర్‌ను మలుపు తిప్పిందని సచిన్ వెల్లడించాడు. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన, బౌన్సీ పిచ్ పై... ప్రమాదకర ఆస్ట్రేలియా బౌలర్లను ఎదుర్కొని సెంచరీ చేయడం తనలో ఎక్కడలేని ఆత్మవిశ్వాసాన్ని నింపిందని సచిన్ అన్నాడు.
వాకా లాంటి ప్రమాదకరమైన పిచ్‌ను ప్రపంచంలో మరెక్కడా చూడలేమని... అక్కడ పరుగులు చేసినట్టయితే ప్రపంచంలో మరెక్కడైనా పరుగులు చేయవచ్చని తాను భావించానని సచిన్ తెలిపాడు.