ఆదివారం, 12 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ప్రస్తుత సిరీస్
Written By Raju
Last Modified: హైదరాబాద్ , ఆదివారం, 18 జూన్ 2017 (21:48 IST)

ఛాంపియన్స్ ట్రోఫీ విజేత పాకిస్తాన్: అంచనాలు అందుకోలేకపోయిన టీమిండియా

చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ కథ ముగిసింది. కోట్లాది భారతీయుల ఆశలను, అంచనాలను అందుకోవడంలో పూర్తిగా విఫలమైన టీమిండియా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పైనల్‌లో ఘోర పరాజయం చవిచూసింది. 54 పరుగులకే అయిదు కీలకమైన వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన భారత జ

చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ కథ ముగిసింది. కోట్లాది భారతీయుల ఆశలను, అంచనాలను అందుకోవడంలో పూర్తిగా విఫలమైన టీమిండియా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పైనల్‌లో ఘోర పరాజయం చవిచూసింది. 54 పరుగులకే అయిదు కీలకమైన వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన భారత జట్టును హార్దిక్ పాండ్యా మెరుపు బ్యాటింగుతో ఆదుకునే ప్రయత్నం చేసినా లేని పరుగుకు ప్రయత్నించి రనౌట్ కావడంతో భారత్ ఆశలు పూర్తిగా ఆవిరైపోయాయి. చివరి మూడు వికెట్లు టపటపా రాలిపోవడంతో టీమిండియా 30.3 ఓవర్లలో 158 పరుగుల వద్ద ఆల్ ఔట్ అయి గేమ్‌ను దాయాదికి జారవిడుచుకుంది.
 
పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలో 1992 ప్రపంచ కప్ తర్వాత ఇదే అతి పెద్ద విజయం. ఊహలకు మించి అడటంలో తనకు తానే రికార్డు సృష్టిస్తున్న పాకిస్తాన్ తొలిసారి ఐసీసీ చాంపియన్స్ ట్రోపీని గెల్చుకుంది. అదికూడా బలమైన దాయాది జట్టుపై 180 పరుగుల భారీ ఆధిక్యతతో గెలుపొందటం విశేషం. 1992లో వరల్డ్ కప్ విజయ, 2009లో ప్రపంచ టి-20 కప్ గెల్చుకున్న తర్వాత పాకిస్తాన్ తన మొదటి గ్లోబల్ టైటిల్ గెల్చుకోవడం ఇదే మొదటిసారి.

ట్రోఫీపై ఎలాంటి ఆశలు లేకుండా ప్రపంచ క్రికెట్లో 8వ స్థానంలో ఉన్న పాక్ రెండో స్థానంలో ఉన్న భారత్‌ను ఘోర పరాజయానికి గురి చేయడం పాకిస్తాన్ అభిమానులను ఉర్రూతలూగించింది. లీగ్ మ్యాచ్‌లో భారత్ చేతిలో చిత్తుగా ఓడిన పాక్ ఫైనల్ మ్యాచ్లో అదే భారత్‌పై చిరస్మరణీయమైన విజయాన్ని అందుకోవడం పాక్ క్రికెట్‌ను మలుపు తిప్పగల గొప్ప ఘటనగా నిలిచిపోనుంది.