కోహ్లీని వెంటాడుతున్న పాక్ యువ క్రికెటర్... రికార్డులన్నీ మాయం...
క్రికెట్ పరుగుల యంత్రంగా పేరుగాంచిన భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని పాకిస్థాన్ యువ క్రికెటర్ బాబర్ అజం వెంటాడుతున్నాడు. దీంతో కోహ్లీ వణికిపోతున్నాడు. తాను నెలకొల్పిన రికార్డులన్ని బాబర్ అజం చెరిపేస్తూ తన వెంటే పరుగెడుతుండటంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో కోహ్లీ ఉన్నాడు. ఇప్పటివరకు వీరిద్దరి ఆటతీరు, చేస్తున్న పరుగులు చూస్తే ఇది నిజమనక తప్పదు.
ఎందుకంటే.. తొలి వెయ్యి పరుగులు చేసేందుకు కోహ్లీ 24 ఇన్నింగ్స్‌లు ఆడితే బాబర్ అజంకు కేవలం 21 ఇన్నింగ్స్‌లు మాత్రమే సరిపోయాయి. అలాగే, రెండు వేల పరుగులను కోహ్లీ 53 ఇన్నింగ్స్‌లలో పూర్తి చేస్తే బాబర్ అజం మాత్రం 45 ఇన్నింగ్స్‌లలో మ్యాచ్‌లలో పూర్తి చేశాడు. అలాగే, మూడు వేల పరుగులను కోహ్లీ 75 ఇన్నింగ్స్‌లలో పూర్తి చేస్తే అజం మాత్రం 68 ఇన్నింగ్స్‌లలో అందుకున్నాడు.
అయితే, విరాట్ కోహ్లీ, అజంల కంటే సౌతాఫ్రికా ఓపెనర్ హర్షిం ఆమ్లా మాత్రం కేవలం 57 ఇన్నింగ్స్‌లలో మూడు వేల పరుగులు పూర్తి చేశాడు. అదేసమయంలో వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం వివిన్ రిచర్డ్స్ 69 ఇన్నింగ్స్‌లలో, ఇదే దేశానికి మరో క్రికెట్ లెజెండ్ సీజీ గ్రీనిడ్జ్ 72 ఇన్నింగ్స్‌లలో, సౌతాఫ్రికా ఆటగాడు గ్యారీ కీర్‌స్టన్ 72 ఇన్నింగ్స్‌లలో మూడు వేల పరుగులు చేసిన రికార్డు సృష్టించారు.