సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 26 ఆగస్టు 2022 (14:37 IST)

రైల్వే స్టేషను సమీపంలో వివాహితపై 2 గంటల పాటు గ్యాంగ్ రేప్

rape
రాజస్థాన్ లో దారుణం జరిగింది. భర్త, పిల్లలకు భోజనం తీసుకువస్తున్న వివాహితను ఐదుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి రైల్వే ట్రాక్ సమీపంలో 2 గంటల పాటు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం బుధవారం రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకూ జరిగిందని పోలీసులు వెల్లడించారు.

 
పూర్తి వివరాలను చూస్తే... ఢిల్లీ వెళ్లేందుకు బాధితురాలు తన భర్తపిల్లలతో కలిసి జైపూర్ రైల్వే స్టేషనులో వేచి వున్నారు. రైలు వచ్చేందుకు మరికొన్ని గంటలు ఆలస్యం అవుతుందని తెలిసి తన భర్తకి, పిల్లలకి సమీపంలో ఓ హోటల్లో భోజనం తెచ్చేందుకు వెళ్లింది. అక్కడ ఆమెను ఐదుగురు వ్యక్తులు వెంబడించారు. రైల్వే స్టేషను వద్ద దింపుతామంటూ ఓ వ్యక్తి మాటలు కలిపేందుకు ప్రయత్నించాడు. తనకేమీ వద్దని చెప్పి ఆమె చకచకా నడుచుకుంటూ వస్తోంది.

 
ఈ సమయంలో ఓ వ్యక్తి ఆమెను గట్టిగా పట్టుకుని రోడ్డుకి, రైల్వే ట్రాకుకి మధ్య వున్న ఫెన్సింగుకి ఆవైపుకి విసిరేసాడు. అవతలకి ముగ్గురు వ్యక్తులు దూకి ఆమెను గట్టిగా పట్టుకున్నారు. కేకలు వేయకుండా నోరు మూసేసారు. అనంతరం ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. రెండుగంటల పాటు దుండగులు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటన రైల్వే పోలీసు స్టేషనుకి 200 కిలోమీటర్ల దూరంలో జరిగింది. దుండగుల నుంచి తప్పించుకున్న బాధితురాలు విషయాన్ని పోలీసులకి ఫిర్యాదు చేసింది. నిందితులను పట్టుుకనేందుకు పోలీసులు అన్ని సిసిటీవీ కెమేరాలను పరిశీలిస్తున్నారు.