శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 18 డిశెంబరు 2023 (22:20 IST)

బస్ కోసం ఎదురుచూస్తున్న మహిళను బైక్ పైన ఎక్కించుకెళ్లి గ్యాంగ్ రేప్

Rape
బస్సు కోసం ఎదురుచూస్తున్న మహిళను నమ్మించి మాయమాటలతో తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ నిందితులను పోలీసులు అరెస్టు చేసారు. కేసుకి సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. డిశెంబరు 7వ తేదీన ఓ మహిళ బస్సు కోసం ఎదురుచూస్తుండగా 32 ఏళ్ల ఏసు తార్నాక నుంచి ప్రశాంత్ నగర్ వెళుతూ ఆమెను చూసాడు.
 
అర్థరాత్రి కావస్తుంది బస్సులు రావని చెప్పి ఆమెను నమ్మించి ఇంటి వద్ద దిగబెడతానని నమ్మించి బైక్ ఎక్కించుకున్నాడు. అలా ఆమెను కొంతదూరం తీసుకెళ్లాక ప్రశాంత్ నగర్ రైల్వే క్వార్టర్స్ సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలో ఆపి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత మరో ముగ్గురు స్నేహితులను పిలిచాడు. వారు కూడా ఆమెపై దారుణానికి తెగబడ్డారు. ఆ తర్వాత బాధితురాలిని తార్నాకలో వదిలేసి పరారయ్యాడు. బాధితురాలు ఫిర్యాదు అందుకున్న పోలీసులు సిసిటివి ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. అందిరనీ అరెస్టు చేసి రిమాండుకు పంపారు.