Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

నెల్లూరులో విషాదం.. అప్పుల బాధ తట్టుకోలేక డ్యాన్సర్ ఆత్మహత్య

Written By వరుణ్
Updated: సోమవారం, 1 మే 2023 (10:48 IST)
నెల్లూరులో విషాదం ఘటన చోటుచేసుకుంది. అప్పుల బాధ తట్టుకోలేక ఒక డ్యాన్సర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బలవన్మరణానికి ముందు ఆయన ఓ సెల్ఫీ వీడియో తీసి పెట్టి, తన ప్రాణాలు తీసుకున్నాడు. మృతుడి పేరు చైతన్య. బుల్లితెరపై ప్రసారమయ్యే ఢీ షో ద్వారా మంచి కొరియోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకున్నాడు.
 
తనకు ఆర్థిక ఇబ్బందులు, పెరిగిపోయిన అప్పుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తన సెల్ఫీ వీడియోలో చైతన్య పేర్కొన్నాడు. ఆత్మహత్య చేసుకుంటున్నందుకు తన తల్లిదండ్రులకు, తోటి డ్యాన్స్ మాస్టర్లకు సారీ చెప్పాడు. చేసిన అప్పులు తీర్చే సామర్థ్యం ఉన్నప్పటికీ అప్పులు ఇచ్చిన వారి ఒత్తిడిని తట్టుకోలేక ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు. 
 
ఒకసారి చేసిన అప్పును తీర్చేందుకు మరో అప్పు చేయడం, ఇలా అప్పు మీద అప్పు తనకు ఇబ్బందిని కలిగించిందని చెప్పాడు. తనకు పేరు తెచ్చిన డ్యాన్స్ షోలకు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. 

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments