శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 28 జనవరి 2022 (14:14 IST)

భర్త పురుషాంగాన్ని కోసి హత్య చేసిన భార్య...

తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. ఈ జిల్లాలోని రఘుదేవపురానికి చెందిన ఓ మహిళ కట్టుకున్న భర్తను చంపేసింది. అతని పురుషాంగాన్ని కోసి మరీ హత్య చేసింది. ఆ తర్వాత మూర్ఛ వ్యాధి కారణంగా చనిపోయినట్టు నమ్మించే ప్రయత్నం చేసి, చివరకు పోలీసులకు చిక్కింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, రఘుదేవపురానికి చెందిన అబ్బులు (46), ముత్యాలు అనే దంపతులు ఉన్నారు. వీరిద్దరి మధ్య కుటుంబ కలహాలు చాలా రోజుల నుంచి కొనసాగుతున్నాయి. పైగా, ఇద్దరికీ మద్యం సేవించే అలవాటు ఉంది. బుధవారం రాత్రి కూడా ఇద్దరూ మద్యం సేవించి గొడవపడి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. అయితే, తెల్లవారుజామున ముత్యాలు ఒక్కరే ఇంటికి వచ్చింది. అబ్బులు మాత్రం రాలేదు. 
 
ఈ పరిస్థితుల్లో రాపాక గ్రామ శివారు కల్వర్టు వద్ద ఓ మృతదేహం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారితో పాటు.. కొందరు స్థానికులు కూడా అక్కడకు చేరుకున్నారు. స్థానికుల్లో కొందరు అబ్బులును గుర్తించి ముత్యాలుకు సమాచారం చేరవేశారు. ఆ వెంటనే అక్కడకు చేరుకున్న ఆమె బోరున విలపిస్తూ తన భర్తకు మూర్ఛ వ్యాధి వుందని, ఆ వ్యాధి కారణంగానే చనిపోయివుంటాడని అందర్నీ నమ్మించి, దహన సంస్కారాలు చేసేందుకు ప్రయత్నించింది. 
 
అయితే, అబ్బులు శరీరంపై గాయాలు ఉండటం, పైగా, పురుషాగం కోసివుండటంతో పోలీసులకు అనుమానం వచ్చి ముత్యాలు వద్ద విచారణ చేపట్టారు. ఈ విచారణలో ముత్యాలు అసలు విషయం వెల్లడించింది. దీంతో కేసు నమోదు చేసి భర్తను హత్య చేసిన భార్యను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.