గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 19 జులై 2024 (15:51 IST)

మైనర్ కుమార్తెపై లైంగికదాడికి తెగబడిన తండ్రి.. ఎక్కడ?

assault
పీకల వరకు మద్యం సేవించిన కన్నతండ్రి.. కన్నూమిన్నూ తెలియక 12 యేళ్ల కుమార్తెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ నగరానికి బీహార్‌కు చెందిన ఓ వ్యక్తి తన కుటుంబంతో కలిసి వలస కార్మికులుగా వచ్చి, వారు సాయి నగర్ కాలనీలో ఉంటున్నారు. 
 
ఈ క్రమంలో భర్తను భార్య వదిలిపెట్టిపోవడంతో తల్లితో ఉంటున్నాడు. కూతురు(12)ను హాస్టల్లో ఉంచి చదివిస్తున్నాడు. కొన్ని రోజుల కిందట కూతురుకు జ్వరం రావడంతో ఇంటికి తీసుకొచ్చాడు. ఇంట్లో తల్లి లేని సమయంలో అర్థిరాత్రి మద్యం మత్తులో కూతురిపై లైంగిక దాడిక పాల్పడ్డాడు. 
 
బాలికకు జరిగిన విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. ఇటీవలి కాలంలో ఈ తరహా ఘటనలు ఎక్కువైపోతుండటం ప్రతి ఒక్కరినీ ఆందోళనకు గురిచేస్తుంది.