బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 19 జులై 2024 (13:16 IST)

విద్యుత్ బిల్లులు చెల్లించాలన్న సిబ్బంది.. ముష్టిఘాతాలు కురిపించిన కిక్ బాక్సర్ (Video)

eb employee
హైదరాబాద్ నగరంలోని సనత్ నగర్‌లో విద్యుత్ సిబ్బందిపై యువకుడు ఒకరు ముష్టిఘాతాలు కురిపించాడు. విద్యుత్ బకాయిలు చెల్లించాలని కోరడమే ఆ సిబ్బంది చేసిన నేరం. విద్యుత్ బిల్లులు చెల్లించాలని సిబ్బంది కోరగా, అతనిపై యువకుడు పిడిగుద్దులు కురిపించాడు. ఈ దాడిలో విద్యుత్ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
హైదరాబాద్ నగరంలోని సనత్ నగర్‌లో విద్యుత్ బకాయిలు రూ.6,858 చెల్లించాలని సాయి గణేష్ అనే విద్యుత్ సిబ్బంది రాములు అనే ఇంటి యజమానిని అడిగాడు. బిల్లు కట్టడానికి యజమాని నిరాకరించారు. దీంతో విద్యుత్ సిబ్బంది కరెంటు కట్ చేశారు. దీంతో యజమాని కుమారుడు కిక్ బాక్సర్ అయిన మురళీధర్ రావు(19) విద్యుత్ సిబ్బందిపై దాడి చేసి పిడి గుద్దులు గుద్దాడు. ఈ పిడిగుద్దులకు తాళలేక ఆ సిబ్బంది అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. వెంటనే స్థానికులు అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.