శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 19 జులై 2024 (13:32 IST)

మాంసానికి మరుగుతున్న కుక్కలు.. పిచ్చికుక్కను మట్టుబెట్టిన జీహెచ్ఎంసీ! (video)

GHMC staff
GHMC staff
గ్రేటర్ హైదరాబాదులో ప్రతి నిత్యం కుక్క కాటు కేసులు నమోదవుతూనే వున్నాయి. రాజధాని పరిధిలోని కొందరు చికెన్, మటన్ షాపుల నిర్వాహకులు మాంసపు వ్యర్థాలు కుక్కలకు వేస్తున్నారు. అవి నాన్ వెజ్ తిని మరిగి.. వాటికి అలవాటు పడుతున్నాయి. 
 
చికెన్, మటన్ వ్యర్థాలు దొరికిన రోజు తినే శునకాలు అవి దొరకని రోజు మాత్రం మనుషులను టార్గెట్ చేస్తున్నాయి. మాంసానికి అలవాటు పడి పసి పిల్లలపై దాడులు చేస్తున్నాయని స్థానికులు అంటున్నారు. 
 
దీనిపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వీధుల్లో తిరుగుతూ.. మనుషులు కనబడితే కరిచేందుకు ఎగబడే కుక్కను జీహెచ్‌ఎంసీ సిబ్బంది మట్టుబెట్టింది. 
 
రోడ్డుపై తిరిగే ప్రతి ఒక్కరినీ కరుస్తున్న సత్యజిత్ పింకు అనే పిచ్చి కుక్కని జీహెచ్‌ఎంసీ సిబ్బంది మట్టుబెట్టింది. దీంతో స్థానికులు హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు.