Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలితో గొడవపడుతూ ఆత్మహత్యకు పాల్పడిన ప్రియుడు.. ఎక్కడ?

Written By ఠాగూర్
Updated: గురువారం, 9 మే 2024 (08:59 IST)
హైదరాబాద్ నగరంలోని రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ విషాదకర ఘటన జరిగంది. ప్రేమించిన యువతితో గొడవపడిన ఓ యువకుడు.. ప్రియురాలతో ఫోనులో మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా తాండూర్‌కు చెందిన ఇమ్రోజ్ పటేల్(29) కొన్ని సంవత్సరాలుగా రాజేంద్రనగర్‌లోని పరమారెడ్డి హిల్స్‌లో నివాసం ఉంటున్నాడు. ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పనిచేస్తున్న ఆయన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. కొన్నిరోజులుగా ఆ ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో ఆ యువతి ఇమ్రోజ్‌ను దూరం పెట్టింది. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన ఇమ్రోజ్ పటేల్ మంగళవారం రాత్రి తాను నివసించే ప్లాట్ నుంచి ఆ యువతికి ఫోన్ చేశాడు. 
 
కొద్దిసేపు మాట్లాడి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ప్రియురాలికి చెప్పాడు. వెంటనే ఆమె అక్కడికి దగ్గరలో ఉండే మరో స్నేహితుడికి ఫోనువో విషయం చెప్పి ఇమ్రోజ్ పటేల్ ఫ్లాట్‌‌కు వెళ్లాలని సూచించింది. ఆయన వెళ్లి చూడగా అప్పటికే ఇంట్లో దుప్పటితో ఉరివేసుకొని ఇమ్రోజ్ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. 

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments