బెంగుళూరులో దారుణం.. రెండో తరగతి విద్యార్థినిపై ప్రిన్సిపాల్ అత్యాచారం

సోమవారం, 7 ఆగస్టు 2023 (11:57 IST)
కర్నాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరులో దారుణం జరిగింది. రెండో తరగతి విద్యార్థినిపై కామాంధుడైన ప్రిన్సిపాల్ అత్యాచారానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఓ బాలిక రెండో తరగతి చదువుతుంది. ఈ బాలిక అనుకోకుండా అస్వస్థతకు గురైంది. ఈ ఘటన వర్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. చిన్నారి పాఠశాలకు వెళుతుండగా, ఈ ఘటన జరిగింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. కామాంధుడైన ప్రిన్సిపాల్‌‍ను అరెస్టు చేశారు. స్కూల్‌లో అస్వస్థతకు గురై భయపడిన బాలికను స్కూల్ పక్కనే ఉన్న తన ఇంటికి ప్రిన్సిపాల్ తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డాడు. 
 
సాయంత్రం స్కూల్ అయిపోయిన సమయానికి ఇంటికి వచ్చిన ఆ బాలిక కడుపునొప్పితో బాధపడుతుండటాన్ని తల్లిదండ్రులు గమనించి, ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ తల్లికి స్కూల్‌లో జరిగిన విషయమంతా వివరించింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రిన్సిపాల్‌ను అరెస్టు చేశారు. అలాగే, మెరుగైన వైద్యం కోసం బాలికను మరో ఆస్పత్రికి తరలించారు. 

అన్నీ చూడండి

PM Modi: ప్రధాని మోదీ పెద్ది గురించి అడిగారు, వెస్ట్ బెంగాల్‌లో యూత్ పెద్ది గెటప్‌తో వచ్చారు: రామ్ చరణ్

Radhya: ది రెడ్ బ్యాగ్ చిత్రం నుంచి హీరోయిన్ రాధ్య లుక్

Satyadev: బిహైండ్ ది వుడ్స్ ఆఫ్ సమవర్తి మేకింగ్ లో సత్యదేవ్

Vadenaveen: వడ్డే నవీన్‌ ట్రాన్స్‌ఫ‌ర్ త్రిమూర్తులు నుంచి తొలి సాంగ్ ‘టా టా’ను విడుదల

హర్షిత్ రెడ్డి దీవాన మూవీ నుంచి వన్ సైడ్ లవ్ స్టోరీ పాటకు ఆదరణ

తర్వాతి కథనం
Show comments