Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరట్‌లో నగ్న ముఠా హల్చల్ - మహిళలపై దాడులు

Written By ఠాగూర్
Published: శనివారం, 6 సెప్టెంబరు 2025 (16:06 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌లో ఓ నగ్న ముఠా హల్చల్ చేస్తోంది. ఈ ముఠాకు చెందిన సభ్యులు మహిళలపై దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఇటీవల మేరఠ్‌లోని భారాలా గ్రామంలో ఓ మహిళ ఒంటరిగా ఆఫీస్‌కు వెళ్తున్న సమయంలో నిర్జన ప్రదేశంలో న్యూడ్‌ గ్యాంగ్‌ ఆమెను పొలంలోకి లాగడానికి యత్నించినట్లు గ్రామస్థులు తెలిపారు. 
 
బాధిత మహిళ కేకలు వేయడంతో వారు అక్కడి నుంచి పారిపోయారన్నారు. స్థానికంగా వారి కోసం గాలించినా ఎవరూ కనిపించలేదని అన్నారు. అయితే తనను లాక్కెళ్లడానికి యత్నించిన వ్యక్తులు ఎటువంటి దుస్తులు ధరించలేదని బాధిత మహిళ పేర్కొంది. తమ గ్రామంలోని ముగ్గురు మహిళలకు ఇటువంటి పరిస్థితే ఎదురైనప్పటికీ భయం, అవమానభారంతో ఈ విషయాన్ని బయటకు వెల్లడించలేదని.. పరిస్థితులు తీవ్రంగా మారుతుండడంతో పోలీసులను ఆశ్రయించామని గ్రామ పెద్ద తెలిపారు.
 
భారాలా, దౌరాలా సహా పలు గ్రామాల ప్రజలు కూడా తాము న్యూడ్‌ గ్యాంగ్‌ను చూశామని చెప్పడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని.. దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటివరకు ఎటువంటి అనుమానితులను గుర్తించలేదని తెలిపారు. గ్రామాలకు సమీపంలో ఉండే అటవీ ప్రాంతంలో ఈ ముఠాలు ఉన్నాయా అనే విషయం తెలుసుకోవడానికి డ్రోన్‌లను ఉపయోగించి.. గాలింపు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా గ్రామాల్లోని పలు ప్రాంతాల్లో పోలీసులను మోహరించినట్లు తెలిపారు. 

అన్నీ చూడండి

Nani: ది ప్యారడైజ్ లో నాని, కాయదు లోహర్ పై సాంగ్, త్వరలో టీజర్

Vinayak: కేఎల్ యూనివర్సిటీ చూడగానే రామోజీ ఫిల్మ్ సిటీ గుర్తుకువస్తుంది: వినాయక్

పావలా శ్యామల కుమార్తె కు అండగా వున్న ఇండస్ట్రీ ని విమర్శించడం మనస్థాపం కలిగించాయి

Sardar 2 teaser: కార్తి, ఎస్ జె సూర్య సర్దార్ 2 యాక్షన్ టీజర్ లో ఇద్దరు గూఢచారులు

రణబాలిలో గాయపడిన రష్మిక.. డల్‌గా కనిపించిన విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments