సోమవారం, 7 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 13 ఆగస్టు 2022 (21:02 IST)

చెప్పులో రూ. 100 కోట్లు, షాకవుతున్నారా? చెన్నైలో పట్టేసారు...

Drugs
డబ్బు సంపాదన కోసం అడ్డదార్లు తొక్కేవాళ్లు అడ్డంగా దొరికిపోతుంటారు. తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది. దేశంలోకి మాదకద్రవ్యాలను స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు ఓ వ్యక్తి. ఐతే అతడు డ్రగ్స్‌ను తీసుకువచ్చిన వైనం చూసి అంతా షాక్ తిన్నారు.

 
ఎప్పటిలానే తనిఖీల్లో భాగంగా కస్టమ్స్ అధికారులు చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన ప్రయాణికుల లగేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇంతలో ఓ వ్యక్తి చాలా సాధారణమైన బ్యాగుతో, చాలా తక్కువరకం చెప్పులతో విమానం దిగి చకాచకా వెళ్తున్నాడు. అతడి వాలకం చూసిన అధికారులు ఆపేశారు.

 
అతడి బ్యాగును కత్తిరించారు. అందులో డ్రగ్స్. ఇంకా చెప్పులను కూడా కత్తితో కత్తిరించి చూడగా అందులో డ్రగ్స్. ఇలా మొత్తం కలిపి సుమారు రూ. 100 కోట్లు విలువైన డ్రగ్స్ అతడు తీసుకునివెళ్తున్నట్లు తేలింది. వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.