గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 25 ఏప్రియల్ 2023 (15:01 IST)

అనుమానాస్పద స్థితిలో 22 ఏళ్ల నర్సు మృతదేహం, అఘాయిత్యం చేసి హత్య చేసారేమో?

image
మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని ఇండోర్‌ భన్వర్కువాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పద స్థితిలో నర్సు మృతదేహం కనిపించడంతో ఆ ప్రాంతంలో సంచలనం నెలకొంది. యువతిది హత్యేమోనని బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతురాలి చేతిపై సూదితో పొడిచినట్లు కొన్ని సూది గుర్తులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.
 
తన సోదరి దీపికా ప్రజాపతి (22) ఖాండ్వా నివాసి అని మృతురాలి సోదరుడు నితిన్ ప్రజాపతి చెప్పారు. ఆమె ఇండోర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తుందని, శనివారం రాత్రి షిఫ్ట్ ఉంది, రాత్రి షిఫ్ట్ తర్వాత ఆమె తన తాత్కాలిక ఇంటికి తేజాజీ నగర్‌కు తిరిగి వెళ్లాల్సి వుంది. ఐతే ఆ సమయంలో ఆమె భన్వర్కువాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎందుకు దిగిందో తమకు అర్థం కావడంలేదన్నారు. తమ సోదరిని ఎవరో హత్య చేసి వుంటారని అనుమానం వ్యక్తం చేసాడు.
 
ఈ సంఘటనకు సంబంధించి, డిసిపి సింగ్ మాట్లాడుతూ, ఘటనకు సంబంధించి పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారన్నారు. యువతి చేతిపై కొన్ని సూది గుర్తులు కనిపించాయనీ, శరీరంపై ఎలాంటి గాయాలు కనిపించడం లేదన్నారు. పోస్టుమార్టం తర్వాతే మరిన్ని వివరాలు వెల్లడించగలమన్నారు.