శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 23 జులై 2024 (12:04 IST)

ప్లాస్టిక్ పట్టీని పెట్టి ఏటీఎంలో డబ్బులు చోరీ చేస్తున్న మైనర్లు (Video)

ATM thieves
వరంగల్ జిల్లాలో బట్టల షాపులో పనిచేయడానికి ఉత్తరప్రదేశ్ నుండి వచ్చిన శుభం అనే యువకుడు తన ప్రియురాలి జల్సాల కోసం ఏటీఎంలో డబ్బులు చోరీ చేయడం మొదలుపెట్టాడు. ఇందుకోసం ఏటీఎం యంత్రంలో డబ్బులు వచ్చే దగ్గర ప్లాస్టిక్ పట్టీని పెట్టి ఫేవిక్విక్‌తో అంటించి వెళ్లేవాడు. డబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి వచ్చిన వారు డబ్బులు రాకపోవడంతో తిరిగి వెళ్ళిపోయేవారు.
 
ఇలా వాళ్లు వెళ్లాక డబ్బులు తీసుకొని శుభం జల్సాలు చేయసాగాడు. దీని గురించి అడిగి తెలుసుకున్న మరికొంత మంది మైనర్లు ఇలా ఏటీఎం చోరీలు చేశారు. ఈ తరహా సంఘటనలు ఎక్కువ కావడంతో పాటు బ్యాంకు అధికారులకు అధిక సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. దీంతో బ్యాంకు అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరివద్ద జరిపిన విచారణలో అసలు దొంగ శుభం తేలింది. ఈ ప్రధాన నిందితుడుతో పాటు అతని ప్రియురాలు కూడా పరారీలో ఉన్నారు.